GT vs KKR: విజయ్ శంకర్ వీరవిహారం - గుజ‌రాత్ చేతిలో కోల్‌క‌తాకు భంగ‌పాటు-vijay shankar shines as gt beat kkr by 7 wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gt Vs Kkr: విజయ్ శంకర్ వీరవిహారం - గుజ‌రాత్ చేతిలో కోల్‌క‌తాకు భంగ‌పాటు

GT vs KKR: విజయ్ శంకర్ వీరవిహారం - గుజ‌రాత్ చేతిలో కోల్‌క‌తాకు భంగ‌పాటు

Nelki Naresh Kumar HT Telugu
Apr 29, 2023 08:30 PM IST

GT vs KKR: శ‌నివారం కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. విజ‌య్ శంక‌ర్ హాఫ్ సెంచ‌రీతో మెర‌వ‌గా శుభ్‌మ‌న్ గిల్ రాణించాడు.

విజ‌య్ శంక‌ర్
విజ‌య్ శంక‌ర్

GT vs KKR: విజ‌య్ శంక‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో చెల‌రేగ‌డంతో శ‌నివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

విజ‌య్ శంక‌ర్ 24 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 51 ర‌న్స్ చేయ‌గా...శుభ‌మ‌న్ గిల్ 35 బాల్స్‌లో ఎనిమిది ఫోర్ల‌తో 49 ర‌న్స్‌తో రాణించ‌డంతో కోల్‌క‌తా విధించిన 179 ప‌రుగులు టార్గెట్‌ను గుజ‌రాత్ మ‌రో రెండు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే ఛేదించింది.

17. 5 ఓవ‌ర్ల‌లోనే మూడు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 180 ప‌రుగులు చేసింది. విజ‌య్ శంక‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్య 20 బాల్స్‌లో 26 ర‌న్స్‌, డేవిడ్ మిల్ల‌ర్ 18 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 32 ర‌న్స్‌తో ఆక‌ట్టుకున్నారు.

కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ర‌సెల్‌, హ‌ర్షిత్‌ రానా, సునీల్ న‌రైన్ త‌లో ఒక్క వికెట్ తీసుకున్నారు. అంతుకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 179 ర‌న్స్ చేసింది ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ 81, ర‌సెల్ 34 ర‌న్స్‌తో కోల్‌క‌తాకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందించారు.

WhatsApp channel