Gambhir on Kohli: నా ప్లేయర్‌ను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్లే.. కోహ్లీకి గంభీర్ మాస్ వార్నింగ్?
Gambhir on Kohli: గంభీర్-కోహ్లీకి మధ్య సోమవారం నాడు జరిగిన గొడవ గురించి ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్ రిపోర్టు ప్రకారం కోహ్లీకి గంభీర్ మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నా ప్లేయర్‌ను అంటే నా ఫ్యామిలీని అన్నట్లే అంటూ గంభీర్.. కోహ్లీని హెచ్చిరించినట్లు సమాచారం.
Gambhir on Kohli: సోమవారం నాడు లక్నో-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ తెలిసిందే. 10 ఏళ్ల క్రితం నాటు ఘర్షణను గుర్తుకుతీసుకొచ్చేలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిందే. ఇరువురు ఒకరిపై మరోకరు వెళ్లేంతలా పరిస్థితి మారడంతో పక్కనున్న ఆటగాళ్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి మాటలు నడిచాయి? ఎవరు నోరు జారారు? అసలు ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది.
లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్.. విరాట్ కోహ్లీతో(Virat Kohli) ఏదో మాట్లాడుతున్నప్పుడు గంభీర్ వచ్చేసి కైల్ మేయర్స్‌ను లాక్కుని వెళ్లడం గమనించవచ్చు. కోహ్లీతో మాట్లాడకుండా అతడిని గంభీర్ తీసుకెళ్లడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. ఆ సమయంలో కోహ్లీ ఏదో అనడం, గంభీర్ తిరిగి అతడిపైకి వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పీటీఐ ఫీల్డ్ రిపోర్టు ప్రకారం.. కోపంతో గంభీర్(Gautam Gambhir) "ఏమన్నావ్ నువ్వు?" అని విరాట్‌ను అడిగాడు. దీనికి కోహ్లీ "నేను మిమల్ని ఏమి అనలేదు? మీరెందుకు మధ్యలోకి వస్తున్నారు?" అని రిప్లయి ఇచ్చాడు. ఇందుకు గంభీర్ మాట్లాడుతూ "నువ్వు నా ప్లేయర్‌ను తిడితే.. నా ఫ్యామిలీని తిట్టినట్లే" అని బదులిస్తాడు. వెంటనే కోహ్లీ "అయితే మీరు మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి" అంటూ ఘాటుగా స్పందిస్తాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గంభీర్.. "అయితే నేను నుంచి నీ నేర్చుకోవాలా?" అంటూ ఫైర్ అవుతాడు. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ చోటు చేసుకుంటుంది.
చూసినవారంతా ఈ విషయంలో ఇద్దరిది తప్పుందని, ఇద్దరూ చిన్నపిల్లల్లా ప్రవర్తించారని అంటున్నారు. ఇలాంటి ఘటనే పదేళ్ల క్రితం 2013లోనూ జరిగింది. అప్పుడు గంభీర్.. కేకేఆర్ తరఫున ఆడుతుండగా.. కోహ్లీ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అప్పుడు కూడా ఇరువురు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అప్పటి నుంచి వీరి మధ్య గొడవ అలాగే కొనసాగుతుంది. గంభీర్ ఎలాగైతే ఫైర్ బ్రాండో.. కోహ్లీ కూడా అలాగే ఉంటాడని, దీంతో రెండు కత్తులు ఓ ఒరలో ఇమడలేకపోతున్నాయని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.
ఈ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హఖ్‌పై కోహ్లీ పదే పదే కామెంట్లు చేయగా.. దీంతో విరాట్‌పై అమిత్ మిశ్రా ఫీల్డ్ అంపైర్‌కు కంప్లైట్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. మైదానంలో ఈ రకమైన ఉద్రిక్త వాతావరణానికి కారణమైన గంభీర్, కోహ్లీ, నవీన్‌పై ఐపీఎల్ యాజమానం కోడ్ ఆఫ్ కండక్ట్ తేల్చి వారి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాగా విధించింది.