తెలుగు న్యూస్  /  Sports  /  Kohli Opening Batting Will Give Good Results In T20is Harbhajan Suggested To Team India

Virat Kohli: టీ20 వరల్డ్ క‌ప్‌లో కోహ్లిని ఓపెన‌ర్‌గా ఆడించాలి : హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌

HT Telugu Desk HT Telugu

10 September 2022, 17:02 IST

  • Virat Kohli:టీ20ల్లో విరాట్ కోహ్లిని ఓపెనింగ్ స్థానంలో ఆడిస్తే బాగుంటుందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (Twitter)

విరాట్ కోహ్లి

Virat Kohli: ఆసియా క‌ప్‌తో విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావ‌డంతో అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆప్ఘ‌నిస్తాన్‌పై సెంచ‌రీ చేసి స‌త్తా చాటాడు. టీ20 ఇంట‌ర్‌నేష‌న‌ల్ కెరీర్‌లో అత‌డికి ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఓ సెంచ‌రీ, రెండు హాఫ్ సెంచ‌రీల‌తో ఆసియా క‌ప్‌లో 276 ర‌న్స్ చేసిన కోహ్లి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు కోహ్లి రాణించ‌డంతో టీమ్ ఇండియా బ్యాటింగ్ క‌ష్టాలు గ‌ట్టెక్కిన‌ట్లేన‌ని మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

టీ20 వరల్డ్ కప్ తో పాటు రానున్న సిరీస్ లలో కోహ్లి ఓపెనింగ్ స్థానంలో ఆడిస్తే బాగుంటుందంటూ టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కోహ్లికి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం ఇబ్బంది ఉండదని, అతడు ఆ స్థానానికి కొత్తేమీ కాదని హర్భజన్ పేర్కొన్నాడు. ‘ఐపీఎల్ లో కోహ్లి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ దిగి భారీగా పరుగులు చేశాడు.

ఓ సీజన్ లో 921 రన్స్ తో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో కె.ఎల్. రాహుల్ స్థానంలో కోహ్లిని ఓపెనర్ గా దించితే బ్యాటింగ్ పరంగా టీమ్ ఇండియా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కె.ఎల్ రాహుల్ ను మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుంది’ అని హర్భజన్ సలహా ఇచ్చాడు.

విరాట్ టాప్ ప్లేయర్స్ లో ఒకడని, అతడి బ్యాటింగ్ ప్రతిభపై సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఆసియా కప్ ద్వారా ఫామ్ లోకి వచ్చిన కోహ్లిపై హర్భజన్ తో పాటు మరికొందరు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.