తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul On Kuldeep : కుల్దీప్‌ను పక్కనపెట్టినందుకు నేనేమీ బాధపడటం లేదు

KL Rahul On Kuldeep : కుల్దీప్‌ను పక్కనపెట్టినందుకు నేనేమీ బాధపడటం లేదు

Anand Sai HT Telugu

25 December 2022, 22:29 IST

    • IND Vs BAN : బంగ్లాతో మెుదటి టెస్టులో కుల్దీప్‌ ప్లేయర్ ఆఫ్ దీ మ్యాచ్ గా ఎంపికయ్యాడు. రెండో టెస్టులో అతడిని పక్కనపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కేఎల్ రాహుల్ క్లారిటీ ఇచ్చారు.
కేఎల్ రాహుల్(ఫైల్ ఫొటో)
కేఎల్ రాహుల్(ఫైల్ ఫొటో) (ANI)

కేఎల్ రాహుల్(ఫైల్ ఫొటో)

బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది టీమ్ ఇండియా(Team India). రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా శ్రేయాస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రాణించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది. అయితే ఈ టెస్టులో కుల్దీప్ ను పక్కనపెట్టారు. దీంతో విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత.. దీనిపై కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) క్లారిటీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

కొన్నేళ్లుగా బౌలింగ్ అటాక్ బాగుందని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. విదేశాల్లోనూ మన బౌలర్లు ఉత్తమ ప్రదర్శన చేశారన్నాడు. బంగ్లా(Bangla)తో రెండో టెస్టులో కుల్దీప్(Kuldeep) లేని లోటు కనిపించిందని తెలిపాడు. తొలి రోజు పిచ్ పరిశీలించాక.. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనిపించినట్టుగా చెప్పాడు. అందుకే కుల్దీప్ ను తీసుకోలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్(IPL)లో ప్రవేశపెట్టబోయే.. ఇంపాక్ట్ ప్లేయర్ పద్ధతి టెస్టుల్లో ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు రాహుల్.

బంగ్లాతో రెండో టెస్టులో ఆ రూల్ ఉంటే గనక.. కచ్చితంగా రెండో ఇన్నింగ్స్ లో కుల్దీప్ ను బౌలింగ్ తీసుకొచ్చేవాడినని చెప్పాడు. అయితే అతడిని పక్కన పెట్టిన నిర్ణయానికి తానేమి బాధపడటం లేదన్నాడు. ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ వికెట్లు తీశారని విషయాన్ని మరిచిపోకుడదన్నారు. వన్డేల్లో ఆడిన అనుభవంతో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు.

మిడిలార్డర్ పైనా కేఎల్ రాహుల్(KL Rahul) స్పందించాడు. చాలా నమ్మకం ఉందని చెప్పాడు. గెలిపించేందుకు కృషి చేస్తారని తెలిపాడు. 'మ్యాచ్ జరుగుతుంటే.. డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఉత్కంఠబరితంగా అయింది. అందరం టెన్షన్ పడ్డాం. బంగ్లా బౌలర్స్ తీవ్రంగా ఒత్తిడికి గురి చేశారు. కొత్త బంతిని ఎదుర్కొవడం కష్టం. బంతి పాతబడుతుంటే.. పరుగులు రాబట్టొచ్చు. కొత్త బంతిని ఆడేవారికి చాలా కష్టం. ఛేజింగ్ లో అనుకున్నదానికంటే.. ఎక్కువ వికెట్లు కోల్పోయాం.' అని కేఎల్ రాహుల్ వివరించాడు.