తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kd Jadhav Google Doodle : ఇండియాకు మెుదటి ఒలంపిక్ మెడల్ తెచ్చింది ఎవరో తెలుసా?

KD Jadhav Google Doodle : ఇండియాకు మెుదటి ఒలంపిక్ మెడల్ తెచ్చింది ఎవరో తెలుసా?

Anand Sai HT Telugu

15 January 2023, 7:57 IST

    • KD Jadhav Birth Anniversary : ఖషాబా దాదాసాహెబ్ జాదవ్.. ఈ పేరు పెద్దగా విని ఉండం. క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతని వారసత్వం ఇప్పటికీ కొల్హాపూర్‌లోని కుస్తీ కేంద్రాలలో ఉంది. కొంతమంది అతడిని దేవుడిగా భావిస్తారు.
గూగుల్ డూడుల్
గూగుల్ డూడుల్

గూగుల్ డూడుల్

Khashaba Dadasaheb Jadhav's birth anniversary : గూగుల్ ఎప్పటికప్పుడు డూడుల్‌లను మారుస్తూ ఉంటుంది. పండుగలు, ఎవరైనా ముఖ్యమైన వ్యక్తుల పుట్టినరోజు సందర్భంగా ఛేంజ్ చేస్తుంది. జనవరి 15న గూగుల్ డుడూల్ పరిశీలిస్తే.. భారత క్రీడాకారుడు ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ ది ఉంది. భారతదేశానికి వ్యక్తిగత విభాగంలో మెుదటి మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు గూగుల్ గుర్తుచేసింది. కానీ.. ఎక్కడో ఆయన కథ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఖాషాబా దాదాసాహెబ్ కథ దాదాపు చరిత్ర పుస్తకాల నుండి కనుమరుగైంది. ఖాషాబా 1952 గేమ్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించి ఈ ఘనత సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

జాదవ్ ఒలంపిక్స్ లోకి రావడం కూడా నాటకీయంగానే ఉంది. 1952లో, జాదవ్ ఫ్లైవెయిట్ ఛాంపియన్ నిరంజన్ దాస్‌ను మూడుసార్లు ఓడించాడు. అతను చివరకు ఒలింపిక్ బెర్త్‌ను సంపాదించడానికి రాజకీయాలు, బ్యూరోక్రసీతో పోరాడాడు. పాటియాలా మహారాజు నుండి మద్దతు లభించింది. 27 ఏళ్ల వయసులో ఖషాబా వ్యక్తిగత క్రీడల్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

అతని వారసత్వం ఇప్పటికీ కొల్హాపూర్‌లోని నివసిస్తుంది. చాలామంది అతన్ని క్రీడలో దేవుడిగా భావిస్తారు. మహారాష్ట్రలోని గోలేశ్వర్‌లో 1926లో జనవరి 15న జన్మించాడు. అతని ఇంటిని ఒలింపిక్ రెసిడెన్స్ అని పిలుస్తారు. ఇక్కడ అతని కుమారుడు రంజిత్ ఉంటున్నాడు. వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నవయసులోనే క్రీడల్లోకి వచ్చిన జాదవ్.. ఒలింపిక్ పోడియంపై భారత్ జెండా ఉండేలా చేశాడు. ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో 1952 వేసవి ఒలింపిక్స్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న స్వతంత్ర భారతదేశపు మొదటి వ్యక్తిగత అథ్లెట్ అయ్యాడు. అతని తండ్రి కూడా గ్రామంలోని అత్యుత్తమ మల్లయోధులలో ఒకరు,

జాదవ్ జీవితం కూడా సాఫీగా ఏం సాగలేదు. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరాడు. జాతీయ స్థాయిలో ఎన్నో పోటీల్లో గెలుపొందాడు. 1982లో అసిస్టెంట్ కమిషనర్ గా పదవీ విరమణ చేసినా పెన్షన్ కోసం కష్టపడాల్సి వచ్చింది. 1984లో ఓ ప్రమాదంలో మరణించాడు. అతని భార్యకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు.