తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shami Reply To Akhtar: అక్త‌ర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన ష‌మీ - ట్వీట్ వైర‌ల్‌

Shami Reply to Akhtar: అక్త‌ర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన ష‌మీ - ట్వీట్ వైర‌ల్‌

14 November 2022, 10:22 IST

  • Shami Reply to Akhtar: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో భార‌త ఓట‌మిపై అవ‌న‌స‌ర కామెంట్స్ చేసిన‌ పాకిస్థానీ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌పై టీమ్ ఇండియా పేస‌ర్ ష‌మీ ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. ఫైన‌ల్‌లో పాక్ ఓట‌మి అనంత‌రం అక్త‌ర్ చేసిన ట్వీట్‌కు ష‌మీ ఇచ్చిన రిప్లై సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ

మహమ్మద్ షమీ

Shami Reply to Akhtar: టీ20 వ‌ర‌ల్డ‌క‌ప్ గెల‌వాల‌నే పాకిస్థాన్ ఆశ‌ల‌కు ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్ చెక్ పెట్టింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న‌ది. ఫైన‌ల్‌లో త‌మ టీమ్ ఓట‌మి పాలు కావ‌డంతో పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో కూడిన సింబ‌ల్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. పాకిస్థాన్ ఓట‌మితో త‌న హృద‌యం ముక్క‌లైంద‌నే అర్థం వ‌చ్చేలా అక్త‌ర్ ఈ ఎమోజీని పోస్ట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అత‌డి ట్వీట్‌కు టీమ్ ఇండియా పాస్థ్ బౌల‌ర్ ష‌మీ సారీ బ్ర‌ద‌ర్ దీనినే క‌ర్మ అంటూ రిప్లై ఇచ్చాడు. అక్త‌ర్ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ ష‌మీ ఇచ్చిన రిప్లై సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పాకిస్థాన్ ఫైన‌ల్‌కు చేర‌కున్న త‌ర్వాత టీమ్‌ను ప్ర‌శంసిస్తూ అక్త‌ర్ ప‌లు ట్వీట్స్‌, కామెంట్స్ చేశాడు.

అదే స‌మ‌యంలో ఇండియా టీమ్ ప‌ట్ల త‌న‌కున్న ద్వేషాన్ని మాట‌ల రూపంలో బ‌య‌ట‌పెట్టాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఓట‌మి పాలైంది. ఈ ఓట‌మికి భార‌త ఆట‌గాళ్లు అర్హులే అంటూ అక్త‌ర్ కామెంట్స్ చేశాడు. పాక్ బౌలింగ్‌తో పోలిస్తే టీమ్ ఇండియా బౌలింగ్‌ గొప్ప‌గా లేదంటూ అక్త‌ర్ వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్‌పై గెల‌వ‌డం ఇంగ్లాండ్‌కు అంత సుల‌భం కాదు. పాక్ బౌల‌ర్లు టీమ్ ఇండియా బౌల‌ర్ల మాదిరి కాదు అంటూ అక్త‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త క్రికెట్ అభిమానులు ఫైర్ అయ్యారు. అత‌డి కామెంట్స్‌పై ష‌మీ త‌న ట్వీట్‌తో ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌ని ఫ్యాన్స్ చెబుతున్నారు.