తెలుగు న్యూస్  /  Sports  /  Irfan Pathan Posts A Tweet About Udaipur Murder And Gets Trolled By Fans

Udaipur Murder: ఉదయ్‌పూర్ హత్యపై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్ సీరియస్

Hari Prasad S HT Telugu

29 June 2022, 18:52 IST

    • Udaipur Murder: ఉదయ్‌పూర్‌లో జరిగిన దర్జీ దారుణ హత్య దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఘటనపై మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌ ద్వారా స్పందించగా.. అతనిపై అభిమానులు సీరియస్‌ అవుతున్నారు.
ఇర్ఫాన్ పఠాన్
ఇర్ఫాన్ పఠాన్ (twitter)

ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: మత పరమైన అంశాలపై తరచూ ట్విటర్‌ వేదికగా స్పందిస్తుంటాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్పాన్‌ పఠాన్‌. ఆ మధ్య ఇదే విషయమై మరో మాజీ క్రికెటర్‌ అమిత్ మిశ్రాతోనూ ట్విటర్‌లో వాదనకు దిగాడు. అయితే తాజాగా ఉదయ్‌పూర్‌లో నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించిన దర్జీని హత్య చేసిన ఉదంతంపై కూడా ఇర్ఫాన్‌ ఓ ట్వీట్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇది కాస్తా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఉదంతంపై ఇర్ఫాన్‌ స్పందిస్తూ.. "ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నా సరే, ఓ అమాయక ప్రాణాన్ని హింసించడం అంటే మొత్తం మానవాళిని హింసించడమే అవుతుంది" అని అన్నాడు. ఈ ట్వీట్‌పై నెగటివ్‌ కామెంట్సే ఎక్కువగా వచ్చాయి. ఏ ధర్మమైనా ఏంటి.. ఆ హత్య చేసిన వాళ్ల ధర్మమేంటో చెప్పొచ్చుగా అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.

నీ నీతి వచనాలు ఇక ఆపు అంటూ మరో యూజర్‌ ఘాటుగానే స్పందించాడు. ఉదయ్‌పూర్‌లో కన్హయ్యలాల్‌ అనే దర్జీని ఇద్దరు వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యను వీడియో కూడా తీయడం గమనార్హం. ఇస్లాంను అవమానించిన వారికి ఇదే గతి పడుతుందంటే ఆ ఇద్దరూ తర్వాత మరో వీడియోను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా వీళ్లు హెచ్చరించారు.

కస్టమర్లుగా సదరు దర్జీ షాపులోకి వెళ్లారు ఆ ఇద్దరు వ్యక్తులు. వీళ్లలో ఒకరి కొలతలను కన్హయ్యాలాల్ తీసుకుంటుండగా.. అతడు సడెన్‌గా కత్తితో దాడి చేశాడు. దీంతో కన్హయ్య గొంతు తెగిపోయింది. ఆ సమయంలో మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయి మరో బెదిరింపు వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

టాపిక్