తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Is The Best Finisher: ఆ విషయంలో ధోనీ దరిదాపుల్లోనూ ఎవరూ రారు.. మహీపై ప్రశంసల వర్షం

Dhoni is the Best Finisher: ఆ విషయంలో ధోనీ దరిదాపుల్లోనూ ఎవరూ రారు.. మహీపై ప్రశంసల వర్షం

29 March 2023, 6:25 IST

  • Dhoni is the Best Finisher: మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అతడికి దరిదాపుల్లోనూ రారని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ అన్నాడు.

ఎంఎస్ ధోనీ
ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

Dhoni is the Best Finisher: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ స్కిల్స్, బ్యాటింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే మహీ.. బ్యాటింగ్‌లోనూ వరల్డ్ బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ఆటకు దూరమైనప్పటికీ ఐపీఎల్‌లో ఇప్పటికీ ప్రేక్షకులన తన ఆటతీరుతో అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ధోనీపై ప్రశంసల వర్షం కురిపంచాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్. తన దృష్టిలో ఫినిషర్ అంటే ధోనీనే గుర్తుకు వస్తాడని, ఆ విషయంలో అతడి దరిదాపుల్లోనూ ఎవరూ ఉండరని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్మెంట్ నన్ను ఎక్కడ బ్యాటింగ్ చేస్తావ్ అని అడిగితే నాలుగో స్థానమని చెబుతాను. కానీ నేను ఎక్కడ ఆడితే బాగుంటుందో, జట్టుకు ఎక్కడ అవసరమవుతానో అక్కడ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏ కాంబినేషన్‌‌లోనైనా నేను సహకరించడానికి సంతోషంగా ఉన్నాను." అని రియాన్ పరాగ్ తెలిపాడు.

"గత మూడేళ్లుగా నేను ఫినిషింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఫినిషర్ అంటే నాకు ధోనీ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ కళను మారెవరూ సాధించలేరు. అతడు గేమ్‌ను ఎలా ఫినిష్ చేస్తాడో ఎల్లప్పుడూ గమనిస్తుంటాను. అలాగే ఆటను ఎలా అంత లోతుగా తీసుకెళ్తున్నాడో చూస్తాను." అని రియాన్ పరాగ్ తెలిపాడు.

ఇటీవల కాలంలో దేశవాళీ మ్యాచ్‌ల్లో బాగా రాణించిన రియనా పరాగ్.. ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత నాలుగేళ్లుగా ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదు. గత సీజన్ మొత్తం మీద అతడు కేవలం ఒకే అర్ధ సెంచరీ చేశాడు. 17 మ్యాచ్‌లు ఆడిన రియాన్.. 16.84 సగటుతో 183 పరుగులు మాత్రమే చేశాడు.

2018 అండర్ 19 వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన రియాన్ పరాగ్ 2022-23 విజయ్ హజారే ట్రోఫీలో ఐదో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 69 సగటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, ఓ అర్ధసెంచరీ ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలోనూ 13.35 స్ట్రైక్ రేటుతో 252 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.