తెలుగు న్యూస్  /  Sports  /  Is There A Reserve Day For Ipl 2023 Final? What Happens If Rain Washes Out Csk Vs Gt Summit Clash

CSK vs GT IPL Final 2023: ఫైనల్ మ్యాచ్ వర్షం అడ్డంకి.. ఫలితం ఎలా నిర్దేశిస్తారు? రిజర్వ్ డే ఉందా?

28 May 2023, 21:07 IST

    • CSK vs GT IPL Final 2023: గుజరాత్-చెన్నై మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయంగా మారింది. తీవ్రంగా వర్షం కురుస్తుండంటంతో ఇప్పటి వరకు టాస్ కూడా పడలేదు. మరి మ్యాచ్ నిర్వహిస్తారా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.
ఐపీఎల్ 2023 ఫైనల్‌కు రిజర్వ్ డే ఉందా?
ఐపీఎల్ 2023 ఫైనల్‌కు రిజర్వ్ డే ఉందా?

ఐపీఎల్ 2023 ఫైనల్‌కు రిజర్వ్ డే ఉందా?

CSK vs GT IPL Final 2023: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ సజావుగా జరిగేలా లేదు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా పడే ఛాన్స్ లేకపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఫైనల్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా? ఎవరిని విజేతగా ప్రకటిస్తారు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రిజర్వ్ డే రూల్స్..

తాజా అప్డేట్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రేపటికి రిజర్వ్ డే ఉంది. గతేడాది మాదిరిగా కాకుండా మ్యాచ్ ప్రారంభమై ఆ రోజు ఫలితం నిర్ణయించనప్పుడు మాత్రమే రిజర్వ్ డేకు వెళ్తుంది. ఒకవేళ కనీసం ఒక్క బంతి పడ్డా.. రిజర్వ్ డే రోజున అక్కడి నుంచే మ్యాచ్ కొనసాగుతుంది. టాస్ పడి ఒక్క బంతి కూడా పడకపోతే రిజర్వ్ డే రోజు కొత్తగా మ్యాచ్ ప్రారంభమవుతుంది. రిజర్వ్ డే రోజు టాస్ కూడా మళ్లీ వేస్తారు. కెప్టెన్లు కూడా తమ జట్లను మార్చుకునే అవకాశముంది.

ఈ నిబంధనలకు అనుగుణంగా 9.35 గంటల లోపు బంతి పడితే ఫుల్ మ్యాచ్ జరుగుతుంది. లేకుంటే అప్పటి నుంచి ఓవర్లను కుదించి నిర్వహిస్తారు. 1.20 గంటల వరకు మ్యాచ్‌ను నిర్వహించే అవకాశముంటుంది. సూపర్ ఓవర్ జరిగేందుకైనా ప్రయత్నిస్తారు.

వీలైనంత వరకు రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ వరకైనా జరిగేలా చూస్తారు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించిన గుజరాత్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. అంతకుముందు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లుంది.