తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Rcb Vs Gt These 4 Player Performance Important For Rcb In Decider Game

RCB Playoff : ఆర్సీబీకి KGF మాత్రమే కాదు.. ఈ నలుగురి ఆట కూడా ముఖ్యమే

Anand Sai HT Telugu

21 May 2023, 13:33 IST

    • RCB Playoff : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మే 21న జరగనున్న రెండు మ్యాచ్‌లు కూడా చాలా కీలకమైనవి. ప్లేఆఫ్ లోకి ఏ జట్టు అర్హత సాధిస్తుందో నిర్ణయిస్తుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మరో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడనుంది.
ఆర్సీబీ
ఆర్సీబీ (twitter)

ఆర్సీబీ

మే 21న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుతో ఆర్‌సీబీ(RCB) గెలిస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ RCB జట్టుకు చాలా కీలకం. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించాలంటే జట్టు సమన్వయంతో కూడిన ప్రదర్శన చేయడం తప్పనిసరి. చాలా మ్యాచ్‌లలో RCB ముగ్గురు ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడిందనే విషయాన్ని కాదనలేం. KGF మీదనే ఆధారపడింది ఆ జట్టు. వారే విరాట్ కోహ్లీ(Virat Kohli), గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే ఈ కీలక మ్యాచ్‌లో కూడా ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడితే ఆర్సీబీ కష్టల్లో పడుతుంది. ఈ స్టార్ ప్లేయర్లే కాకుండా మిగతా ఆటగాళ్లు కూడా తమ బాధ్యతలను పూర్తిచేయాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఈ నలుగురు ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ ఐపీఎల్‌లో యువ ఆటగాడు అనూజ్ రావత్‌(anuj rawat)కు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. రావత్ చాలా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కానీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి దశలో మంచి ప్రదర్శన కనబరిచాడు. నేటి మ్యాచ్‌లో అవకాశం ఇస్తే రావత్ మళ్లీ అలాంటి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.

న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌కు ఈసారి పెద్దగా అవకాశాలు రాలేదు. బ్యాటింగ్‌లో బ్రేస్‌వెల్ అద్భుత సామర్థ్యం ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ప్రదర్శన ఇవ్వాలి. బ్రేస్‌వెల్ ఇప్పటివరకు తన బౌలింగ్ అవకాశాలలో మెరుస్తూనే ఉన్నాడు. బ్యాటింగ్‌లోనూ బ్రేస్‌వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ RCB బౌలింగ్ విభాగంలో బలమైన ఆటగాడు. పార్నెల్ రాజస్థాన్ రాయల్స్‌పై అతని అద్భుతమైన ప్రదర్శనతో సహా కొన్ని అద్భుతమైన ఆటలు ఆడాడు. తద్వారా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో పార్నెల్ దాడి కీలకం. బెంగుళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగనుండడంతో భారీ స్కోర్లు సాధించాలనే పట్టుదలతో గుజరాత్ ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి ఆటగాళ్లను కట్టడి చేసేందుకు పార్నెల్ తగిన వ్యూహంతో ముందుకు రావాలి.

ఈ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు తరఫున మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) ఆటతీరు అద్భుతం. సిరాజ్ మొదటి నుంచి ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాడు. నేటి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుపై కూడా ఇదే విధమైన దాడి జరగవచ్చని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లోనూ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి కొన్ని ముఖ్యమైన వికెట్లు సాధిస్తే గుజరాత్ జట్టు ఒత్తిడికి లోనవుతుందనడంలో సందేహం లేదు.