RCB Depends on KGF: ‘కేజీఎఫ్‌’పై ఎక్కువగా ఆధారపడుతున్న ఆర్సీబీ.. టీమిండియా మాజీ ఓపెనర్ స్పష్టం-aakash chopra says rcb over reliance on kgf ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Aakash Chopra Says Rcb Over Reliance On Kgf

RCB Depends on KGF: ‘కేజీఎఫ్‌’పై ఎక్కువగా ఆధారపడుతున్న ఆర్సీబీ.. టీమిండియా మాజీ ఓపెనర్ స్పష్టం

Maragani Govardhan HT Telugu
May 11, 2023 11:30 AM IST

RCB Depends on KGF: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎక్కువగా కేజీఎఫ్- కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఫాఫ్ డుప్లెసిస్‌పై ఆధారపడుతోంది భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ నిలకడలేమిపై ఆయన స్పందించారు.

కోహ్లీ -డుప్లెసిస్
కోహ్లీ -డుప్లెసిస్ (PTI)

RCB Depends on KGF: ఈ సాల కప్ నమ్దే- అంటూ ప్రతి సారి ఐపీఎల్ టైటిల్‌పై అభిమానులకు ఆశలు పెడుతున్న ఆర్సీబీ.. వరుసగా విఫలమవుతోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టోర్నీని ముద్దాడలేకపోయింది. వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. ఈ సీజన్‌లోనూ తన పాత ఒరవడినే కొనసాగిస్తోంది. ఇటీవల ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ అది కాపాడుకోలేకపోయింది. ఫలితంగా పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు. ఆర్సీబీ పరాజయానికి కారణం చెప్పాడు.

"ఆర్సీబీ ఎక్కువగా కేజీఎఫ్‌పై ఆధారపడుతోంది. అలాగే ఈ సీజన్‌లో వారి బౌలింగ్ కొంచెం కుదుటపడింది. అయితే గత మ్యాచ్‌లో ఇందుకు విరుద్ధంగా రోహిత్ సేన పుంజుకుంది. వారు తమ అత్యుత్తమ ఆటను కనబర్చారు. దీంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు" అని ఆకాష్ చోప్రా అన్నాడు.

ఆకాష్ చోప్రా చెప్పినట్లు కేజీఎఫ్‌లో కే అంటే విరాట్ కోహ్లీ(Kohli), జీ అంటే గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell), ఎఫ్ అంటే ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis) అని అర్థం. ఈ సీజన్‌లో వీరు ముగ్గురే జట్టు భారాన్ని మోస్తున్నారు. ఇప్పటి వరకు సీజన్‌లో కోహ్లీ 420, మ్యాక్స్‌వెల్ 330, ఫాఫ్ డుప్లెసిస్ 476 పరుగులతో రాణించారు. విరాట్ కోహ్లీ గురించి స్పందించిన ఆకాష్ చోప్రా ఆసక్తికర ట్వీట్ చేశారు.

"విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున 7 వేల పరుగులు చేశాడు. 16 ఏళ్లలో ఏ భారతీయ ఆటగాడు కూడా ఆ జట్టు తరఫున 1000 పరుగులు కూడా చేయలేదు. అంతేకాకుండా సగం ఆట చిన్నస్వామి స్టేడియంలోనే గడిచిపోయింది." అని ఆకాష్ చోప్రా మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఆర్సీబీ తరఫున 1000 పరుగులు చేసిన విదేశీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ నిలిచాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో అతడు 41 బంతుల్లో 65 పరుగులు చేసి ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది ఆర్సీబీకి కెప్టెన్‌గా జట్టులోకి వచ్చిన డుప్లెసిస్.. 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 41.76 సగటుతో142.62 స్ట్రైక్ రేటుతో 1044 పరుగులు చేశాడు. ఈ జట్టు తరఫున 9 అర్ధశతకాలు నమోదు చేశాడు. అత్యధికంగా 96 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 576 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు.

WhatsApp channel