DC Vs RCB : విరాట్ కోహ్లీపై ఆకాష్ చోప్రా సైలెంట్ సెటైర్లు
Aakash Chopra On Virat Kohli : ఆర్సీబీపై దిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో సాల్ట్ బ్యాటింగ్ అద్భుతం.. అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీని సైలెంట్ గా విమర్శిస్తున్నారు.
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ(RCB) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆర్‌సీబీ బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. బౌలింగ్, ఫిల్డింగ్ లో బెంగళూరు జట్టు విఫలమైంది. దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సాల్ట్(Salt) ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. కేవలం 45 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 87 పరుగులు చేసి దిల్లీ క్యాపిటల్స్‌ను సులువుగా గెలిపించాడు.
ఈ ఆటపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా(Aakash Chopra) ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా సాల్ట్ ఆటతీరును ప్రశంసించిన ఆకాష్ చోప్రా, ఇదే సందర్భంలో RCB ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్ పై విమర్శలు చేశాడు.
'సాల్ట్ ఆటతీరు గాయంపై ఉప్పు రుద్దుతున్నట్టుగా ఉంది. అతని ఆట చాలా దూకుడుగా ఉంది. బంతిని నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లు దిల్లీ పోలీసులకు కూడా సమాచారం ఉంది. ఓపెనర్ అంటే ఇలా ఉండాలి. అతను నెమ్మదిగా ఉండకూడదు.' అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇలా చెప్పడం ద్వారా ఆకాష్ చోప్రా.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శనను విమర్శిస్తూనే సాల్ట్ ఆటతీరును మెచ్చుకున్నాడు. ఆకాష్ చోప్రా ఇక్కడ విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరును ప్రస్తావించలేదు, అయితే దిల్లీ క్యాపిటల్స్‌పై విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్ల RCB పెద్ద స్కోరు చేయలేకపోయిందని విశ్లేషణలు జరుగుతున్నాయి. అదే కారణంతో ఆకాష్ చోప్రా కోహ్లీని పరోక్షంగా విమర్శించాడని అంటున్నారు.
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేసి శుభారంభం చేసింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మళ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 55 పరుగులు చేసినా.. అందుకు 46 బంతులు కావాల్సి వచ్చింది. అంటే కోహ్లీ 119.57 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ మ్యాచ్‌లో అంత నెమ్మదిగా బ్యాటింగ్ చేయలేదు. తద్వారా వేగంగా పరుగులు చేసే అవకాశం వచ్చినా.. కోహ్లీ బ్యాటింగ్(Kohli Batting) శైలి కారణంగానే జట్టుకు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లి, మహిపోల్ లోమ్రోర్ హాఫ్ సెంచరీలు చేయగా, డుప్లెసిస్ 45 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ సున్నా పరుగులతో ఫెవిలియన్ చేరాడు.
ఆర్‌సీబీ ఇచ్చిన ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు దూకుడుగా ఆడడం ప్రారంభించింది. ముఖ్యంగా పిలిప్ సాల్ట్ కేవలం 45 బంతుల్లోనే 87 పరుగులు చేసి ఆర్సీబీ జట్టు గెలుపు కలను చెదరగొట్టాడు. అతనికి డేవిడ్ వార్నర్, రిలే రోస్సో అద్భుతంగా మద్దతు ఇచ్చారు. ఆర్‌సీబీ ఇచ్చిన లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే పుర్తి చేసింది దిల్లీ క్యాపిటల్స్.
సంబంధిత కథనం