Virat Kohli Bowling : నేను బౌలింగ్ చేసి ఉంటే 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారు.. కోహ్లీ కామెంట్స్
16 May 2023, 7:30 IST
- Virat Kohli In Dressing Room : మే 14న రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. అత్యల్ప స్కోరుకే ఆలౌట్ చేసింది. దీనిపై కింగ్ కోహ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ
మే 14న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా 2 పాయింట్లు సాధించడమే కాకుండా మంచి నెట్ రన్ రేట్‌ను పొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుండి ఐదో స్థానానికి ఎగబాకింది.
ఆర్సీబీ బౌలింగ్(RCB Bowling) విభాగం రాజస్థాన్ రాయల్స్ జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి గెలిచింది. కేవలం 9 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక జట్టు చేసిన మూడో అత్యల్ప స్కోరు కూడా ఇదే. ఇంత గొప్ప విజయం సాధించిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు చేసుకుంది.
మ్యాచ్‌పై ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది, ఇందులో విరాట్ కోహ్లీ(Virat Kohli) మాటలు వైరల్‌గా మారాయి. 'నేను బౌలింగ్ చేసి ఉంటే, రాజస్థాన్ రాయల్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేది' అని చెప్పాడు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మ్యాక్స్ వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ బాగా ఆడారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో రాజస్థాన్ రాయల్స్ విఫలమైంది. బెంగళూరు బౌలింగ్ ధాటికి 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే ఆలౌటైంది. రాజస్థాన్ రాయల్స్ మీద RCB బౌలింగ్ తో దాడి చేసింది. దీనిపై విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తాను బౌలింగ్ చేసి ఉంటే.. 40కే ఆలౌట్ అయ్యేవారని వ్యాఖ్యానించాడు.
గతంలో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. 4 వికెట్లు కూడా తీశాడు. అయితే 2012 తర్వాత కోహ్లి బౌలింగ్ దుస్సాహసానికి కాస్త దూరంగానే ఉన్నాడు. ఒకే ఓవర్లో 31 పరుగులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. 2012లో CSKపై విరాట్ కోహ్లి 19వ ఓవర్ వేశాడు. ఈ సమయంలో, CSK ఆటగాడు అల్బీ మోర్కెల్ 3 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో మొత్తం 31 పరుగులు చేశాడు. దీని తర్వాత, కోహ్లీ 2 సీజన్లలో (2015, 2016) మాత్రమే బౌలింగ్ చేశాడు.