Maxwell Expecting Child: తండ్రి కాబోతున్న ఆర్సీబీ స్టార్ ప్లేయర్-maxwell expecting child in september ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Maxwell Expecting Child In September

Maxwell Expecting Child: తండ్రి కాబోతున్న ఆర్సీబీ స్టార్ ప్లేయర్

Hari Prasad S HT Telugu
May 11, 2023 03:43 PM IST

Maxwell Expecting Child: తండ్రి కాబోతున్నాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అతని భార్య వినీ రామన్ ఇప్పుడు ప్రెగ్నెంట్. వీళ్లు ఈ ఏడాది సెప్టెంబర్ లో పేరెంట్స్ కాబోతున్నారు.

గతేడాది పెళ్లితో ఒక్కటైన మ్యాక్స్‌వెల్, వినీ రామన్
గతేడాది పెళ్లితో ఒక్కటైన మ్యాక్స్‌వెల్, వినీ రామన్

Maxwell Expecting Child: ఆస్ట్రేలియా, ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. గతేడాది చెన్నైకి చెందిన వినీ రామన్ ను అతని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వినీ ప్రస్తుతం ప్రెగ్నెంట్. వీళ్లిద్దరూ సెప్టెంబర్ లో తమ తొలి సంతానాన్ని పొందబోతున్నారు. మ్యాక్స్‌వెల్, వినీ గతేడాది మార్చి 18న పెళ్లి చేసుకున్నారు.

తమకు బిడ్డ పుట్టబోతుందన్న విషయాన్ని వినీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్టుతోపాటు చిన్నారి డ్రెస్ ఫొటోలను ఇందులో ఆమె పోస్ట్ చేయడం విశేషం. "మా రెయిన్‌బో బేబీ సెప్టెంబర్ లో పుట్టబోతోందని చెప్పడానికి గ్లెన్, నేను చాలా సంతోషిస్తున్నాం.

అయితే ఈ ప్రయాణం అంత సులువుగా, సాఫీగా సాగిపోయిందని మాత్రం చెప్పను. మీకూ ఇలాంటి టైమ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఇలాంటి పోస్టులు చూసి ఎంత బాధపడతారో నాకు తెలుసు. అలా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు మా ప్రేమాభిమానాలను పంపిస్తున్నాం" అని వినీ ఈ పోస్టు చేసింది.

గతేడాది ఈ ఇద్దరి పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది. అయితే పూర్తి తమిళ సాంప్రదాయంలో ఈ జంట ఏడడుగులు వేసింది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత వీళ్లు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకున్నారు.

అప్పట్లో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న మ్యాక్స్‌వెల్ తాను తండ్రి కాబోతున్న విషయం తెలుసుకొని తెగ ఆనందపడుతున్నాడు. ఈ సీజన్ మొదట్లో అంతగా ఫామ్ లో లేని మ్యాక్సీ.. తర్వాత వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం