Ishant Heroic Performance: ఇషాంత్ బౌలింగ్ చూసి ఆశ్చర్యమేసింది.. దిల్లీ పేసర్‌పై వార్నర్ ప్రశంసల వర్షం-david warner prasise ishant sharma heroic performance against gujarat ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  David Warner Prasise Ishant Sharma Heroic Performance Against Gujarat

Ishant Heroic Performance: ఇషాంత్ బౌలింగ్ చూసి ఆశ్చర్యమేసింది.. దిల్లీ పేసర్‌పై వార్నర్ ప్రశంసల వర్షం

Maragani Govardhan HT Telugu
May 03, 2023 06:36 AM IST

Ishant Heroic Performance: గుజరాత్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన దిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి బౌలింగ్ చూసి ఆశ్చర్యమేసిందని తెలిపాడు.

ఇషాంత్ శర్మ
ఇషాంత్ శర్మ (AFP)

Ishant Heroic Performance: ఐపీఎల్ 2023(IPL 2023) పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను(Gujarat Titans) అన్నింటికంటే దిగువన ఉన్న దిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. 131 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ అద్భుతంగా డిఫెండ్ చేసుకుని 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 12 పరుగులు కావాల్సిన తరుణంలో బౌలింగ్‌కొచ్చిన ఇషాంత్ శర్మ(Ishant Sharma) కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా ఓ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner).. ఇషాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఇషాంత్ బౌలింగ్ చేసున్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది. అతడు రోజురోజుకు కుర్రాడిలా అయిపోతున్నాడు. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. క్రెడిట్ అంతా అతడికే ఇవ్వాలి. రాహుల్ తేవాటియాను చూసి కాస్త కంగారు పడ్డాను. ఇషాంత్ తన ప్లాన్ ఎలా అమలు చేయాలనుకుంటున్నాడో స్పష్టంగా తెలిపాడు. చివరకే అదే చేసి మా జట్టుకు 3వ విజయాన్ని అందించాడు." అని వార్నర్ స్పష్టం చేశాడు.

ఆఖరులో అద్భుతం..

చివరి ఓవర్‌కు గుజరాత్ విజయానికి 12 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఈ ఐపీఎల్‌లో బెస్ట్ ఫినిషర్లుగా పేరు గాంచిన హార్దిక్ పాండ్య, రాహుల్ తెవాటియా ఉన్నారు. అంతకు ముందే19వ ఓవర్లో డెత్ ఓవర్ స్పెషలిస్టు అయిన అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో రాహుల్ 3 సిక్సర్లు బాది గుజరాత్ శిభిరంలో ఆశలు నిలిపాడు. దీంతో ఆఖరు ఓవర్లో 12 పరుగులు మాత్రమే అవసరం కావడం, క్రీజులో డేంజరస్ బ్యాటర్లు ఉండటంతో గుజరాత్ విజయం నామమాత్రమే అనుకున్నారు. ఇలాంటి ఉత్కంఠ భరిత సమయంలో రాహుల్ తెవాటియాను ఔట్ చేయడమే కాకుండా కేవలం 6 పరుగులే ఇచ్చి దిల్లీని విజయం ముంగిట నిలిపాడు ఇషాంత్.

వేలంలో ఇషాంత్ శర్మను దిల్లీ క్యాపిటల్స్(Delhi capitals) అతడి బేస్ ప్రైస్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎకానమీ రేటు కూడా ఓవర్‌కు 6 పరుగులే ఉండటం గమనార్హం. దిల్లీ వరుసగా ఐదు ఓటములు అందుకున్న తర్వాత కానీ ఇషాంత్ శర్మకు తుది జట్టులో అవకాశం రాలేదు. దీంతో తనకు వచ్చిన ఛాన్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు ఇషాంత్.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 131 పరుగుల లక్ష్యాన్ని చివరి వరకు పోరాడి కాపాడుకుంది. గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య(56) అర్ధశతకంతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. అతడు మినహా మిగిలిన వారు విఫలం కావడంతో మ్యాచ్ వార్నర్ సేన గెలిచింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా.. అన్రిచ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. అమన్ హకీమ్ ఖాన్(51) అర్ధసెంచరీ మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లతో విజృంభించాడు.

WhatsApp channel