Shami Match Fixing Allegations: షమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇషాంత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shami Match Fixing Allegations: 2018లో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఇన్వేస్టిగేషన్‌పై టీమ్ ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Shami Match Fixing Allegations: నాలుగేళ్ల క్రితం వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల వల్ల టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ కెరీర్ ప్రమాదంలో పడింది. కానీ ఆ ఇబ్బందులను అధిగమిస్తూ అద్భుత బౌలింగ్‌తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు షమీ. 2018లో షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసును పెట్టింది. అంతటితో ఆగకుండా అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది.
పాకిస్థాన్ అమ్మాయితో షమీకి సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమె నుంచి షమీ భారీ డబ్బులు తీసుకుంటూ మ్యాచ్ ఫిక్స్ంగ్ పాల్పడి దేశాన్ని మోసం చేశాడంటూ హసీన్ జహాన్ పేర్కొన్నది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ యూనిట్ సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు, షమీ ఎదుర్కొన్న ఇబ్బందులపై టీమ్ ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
షమీ ఫిక్సింగ్ ఆరోపణలపై తనతో పాటు టీమ్ ఇండియా మెంబర్స్ అందరిని యాంటీ కరెప్షన్ యూనిట్ హెడ్ నీరజ్ కుమార్ విచారించారని ఇషాంత్ శర్మ గుర్తుచేశాడు. షమీ డబ్బు కోసం ఫిక్సింగ్ పాల్పడ్డాడా అని మమ్మల్ని అడిగారు. కానీ షమీ 200 శాతం అలాంటి పనిచేయడని బలంగా యాంటీ కరప్షన్ యూనిట్‌తో బలంగా చెప్పాను.
షమీపై నాకున్న నమ్మకంతోనే అలాంటి తప్పుడు పనులు అతడు చేయడని అన్నాను. ఆ సమయంలో షమీ వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రశ్నలు అడిగారు. అవేవీ తనకు తెలియదని యాంటీ కరప్షన్ టీమ్‌కు చెప్పానని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. ఈ విచారణ తర్వాత షమీతో తన అనుబంధం మరింత బలపడిందని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీకి బీసీసీఐ క్లీన్‌చీట్ ఇచ్చింది.
టాపిక్