Hardik Sledges to Krunal: కృనాల్‌తో హార్దిక్ స్లెడ్జింగ్.. అన్నను రెచ్చగొట్టిన తమ్ముడు.. నెట్టింట వైరల్
Hardik Sledges to Krunal: లక్నో బ్యాటర్ కృనాల్ పాండ్యను.. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ స్లెడ్జింగ్ చేశాడు. ఇద్దరూ సోదరులే అయినప్పటికీ వేర్వేరు జట్లలో ఆడుతున్నారు. అయితే హార్దిక్.. కృనాల్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Hardik Sledges to Krunal: శనివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న గుజరాత్.. తమ ప్రదర్శనతో అదరగొట్టింది. ఒకానొక సమయంలో సులభంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన లక్నో చివరకు వెంట వెంటనే వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాండ్య బ్రదర్స హార్దిక్ గుజరాత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కృనాల్ లక్నో తరఫున ఆల్ రౌండర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన అన్న కృనాల్‌ను హార్దిక్ పాండ్య స్లెడ్జింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లక్నో జట్టు కృనాల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‍లో ముందుగా పంపించింది. రషీద్ ఖాన్.. కైల్ మేయర్స్‌ను ఔట్ చేయడంతో.. కృనాల్ మైదానంలోకి అడుగుపెట్టాడు. క్రీజులోకి అతడు వచ్చే సమయంలో హార్దిక్ తన సోదరుడిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. కొన్ని మాటలను జారవిడిచాడు. అయితే కృనాల్ స్పందించకపోయే సరికి హార్దిక్ నవ్వుతూ కనిపించాడు. కృనాల్‌తో మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించిన హార్దిక్.. అతడి నుంచి ఏదైనా స్పందన వస్తుందోమోనని ఆశించాడు. కానీ తన అన్న మాత్రం హల్మెట్స్, గ్లోవ్స్ సరిదిద్దుకుంటూ హార్దిక్‌ను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
హార్దిక్ బ్రో.. కృనాల్ మీ అన్నేగా ఎందుకు రెచ్చగొడుతున్నావ్ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. అన్నతో స్లెడ్జింగ్ తప్పు బ్రో అంటూ మరొకరు స్పందించారు. హార్దిక్ ఆటపట్టించేందుకు ప్రయత్నించాడని ఇంకొకరు తెలిపారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. లక్నో ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. చివరి ఓవర్లలో తెలివిగా బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు ఎట్టకేలకు విజయం సాధించారు. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేని లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ అర్ధశతకం చేసినా మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు.