Harbhajan On Warner : కెప్టెన్​గా వార్నర్ వేస్ట్.. హర్భజన్ సంచలన కామెంట్స్-harbhajan singh comments on david warner over delhi capitals captaincy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Harbhajan Singh Comments On David Warner Over Delhi Capitals Captaincy

Harbhajan On Warner : కెప్టెన్​గా వార్నర్ వేస్ట్.. హర్భజన్ సంచలన కామెంట్స్

Anand Sai HT Telugu
May 01, 2023 01:31 PM IST

IPL 2023 : ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డేవిడ్ వార్నర్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే అతడు కెప్టెన్‌గా సరిపోడని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కారణం కూడా చెప్పుకొచ్చాడు.

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (ఫైల్ ఫొటో)
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (ఫైల్ ఫొటో) (ANI)

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ప్రమాదం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో డేవిడ్ వార్నర్‌(David Warner)కు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. కానీ అతని నాయకత్వంలో ఢిల్లీ చాలా పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌లు ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది. హ్యాట్రిక్ విజయాన్ని ఆశించిన ఢిల్లీకి సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) గట్టి దెబ్బ వేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(harbhajan singh).. డేవిడ్ వార్నర్ నాయకత్వాన్ని విమర్శించారు. కెప్టెన్‌గా వార్నర్ విఫలమవుతున్నందున, బదులుగా అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించాలని సూచించాడు.

'వార్నర్ పునరాగమనం చేయగలడని నేను అనుకోను. జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. ఇది చాలా నిరాశపరిచింది. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడు. నాయకత్వ నైపుణ్యాలను కూడా కలిగి ఉన్నాడు. వారికి ఈ బాధ్యతను అప్పగించడం మంచిది. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా పరువు కాపాడుకోవాలి.'అని హర్భజన్ చెప్పాడు. దీనికి తోడు వార్నర్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌పై కూడా విమర్శలు చేశాడు.

హైదరాబాద్‌పై వార్నర్ తొందరగానే ఔటైతే బాగుండేది. బంతులు వృథా చేశాడని విమర్శించాడు. నాయకత్వంతో పాటు అతని స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉందని చెప్పాడు హర్భజన్. ఇప్పుడు కూడా ఇతర ఆటగాళ్ల తప్పుల గురించి మాట్లాడుతున్నాడని, మీరు ఏం చేశారని ప్రశ్నించారు.

'వార్నర్ 8 మ్యాచ్‌ల్లో 38.5 సగటుతో 306 పరుగులు చేశాడు. అయితే స్ట్రైక్ రేట్ 118.60 మాత్రమే. మీరు 300 ప్లస్ పరుగులు సాధించారు. అయితే మీ స్ట్రైక్ రేట్‌ని ఒకసారి చూడండి. మీ 300 పరుగులు DCకి మేలు చేయలేదు. ఢిల్లీ జట్టు అట్టడుగున ఉండడానికి కారణం ఏమిటో వార్నర్ చూసుకోవాలి.' అని భజ్జీ అన్నాడు.

అయితే నాయకత్వ మార్పునకు ఢిల్లీ యాజమాన్యం అంగీకరించడం అనుమానమే. అంతకుముందు వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన ఘటన కూడా జరిగింది. 2021లో హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న వార్నర్‌ను తొలగించి కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ అందించారు. చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ మే 2న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం