SRH Injury Update: సన్‌రైజర్స్‌కు పెద్ద షాక్.. గాయంతో స్టార్ స్పిన్నర్ ఐపీఎల్‌కు దూరం
SRH Injury Update: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. తొడ గాయంతో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ట్విటర్ వేదికగా తెలియజేసింది.
SRH Injury Update: ఐపీఎల్ 2023లో వరుస పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ డీలా పడింది. ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 2 మినహా మిగిలిన ఐదింటిలో ఓటమి చవి చూసిన ఆరెంజ్ ఆర్మీ గెలుపు కోసం తీవ్రంగా చూస్తోంది. ఇలాంటి సమయంలో ఈ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ టీమ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar).. ఇండియ్ ప్రీమియర్ లీగ్ 2023కి దూరం కానున్నాడు. తొడ గాయంతో(hamstring injury) ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
"ఐపీఎల్ 2023కి వాషింగ్టన్ సుందర్ దూరం కానున్నాడు. తొడనరం గాయంతో అతడు మొత్తం టోర్నీకి అందుబాటులో ఉండట్లేదు. త్వరగా కోలుకో వాషింగ్టన్" అంటూ సన్‌రైజర్స్ జట్టు ట్విటర్ వేదికగా తెలిపింది.
వాషింగ్టన్ సుందర్ గాయపడంతో అతడి స్థానంలో ఆడే స్పిన్నర్ ఎవరనేది సన్‌రైజర్స్ ఇంకా ప్రకటించలేదు. సుందర్ ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున పెద్దగా ఆకట్టుకోలేదు. ఏడు మ్యాచ్‌ల్లో 60 పరుగులు మాత్రమే చేసిన ఈ ఆల్ రౌండర్.. 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడిని ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ జట్టు రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గత ఐపీఎల్‌లోనూ గాయం కారణంగా దూరమయ్యాడు.
తాజాగా ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండకపోవడంతో సన్‌రైజర్స్ పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న ఈ జట్టు.. ఇప్పుడు సుందర్ గైర్హాజరుతో మరింత క్లిష్టతరం కానుంది. గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలిచిన ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికకలో 9వ స్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 29న దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది ఈ జట్టు.