Kumble on Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయకపోవడంపై కుంబ్లే అసంతృప్తి.. జట్టులో ఉండాలని స్పష్టం
Kumble on Washington Sundar: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులో ఎంపిక చేయకపోవడంపై అనిల్ కుంబ్లే స్పందించాడు. అతడిని తుది జట్టులో ఉంచాల్సిందని అభిప్రాయపడ్డాడు.
Kumble on Washington Sundar: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టిన తెలిసిందే. అతడి స్థానంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు అవకాశం కల్పించింది సన్‌రైజర్స్ యాజమాన్యం. తుది జట్టులోకి సుందర్‌ను తీసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్పందించాడు. అల్ రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్‌ను తప్పించడం సరికాదంటూ తమ స్పందనను తెలియజేశాడు.
"వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉండాల్సింది. అవును.. అతడు మంచి ప్రదర్శన చేసుండకపోవచ్చు. తొలి మూడు మ్యాచ్‌ల్లో తన స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవచ్చు. కానీ జట్టులో ఉండుంటే బాగుండేది. అభిషేక్ శర్మ మెరుగైన ఆటగాడే కావచ్చు. కానీ ఈ ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు తుది జట్టులో ఉండేందుకు పూర్తిగా అర్హులు. ఇరువురిలోనూ చాలా టాలెంట్ ఉంది." అని కుంబ్లే స్పష్టం చేశాడు.
వాషింగ్టన్ సుందర్ తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 16 పరుగులు చేశాడు. అంతేకాకుండా అన్నింటింలో కలిపి 5 ఓవర్లు బౌలింగ్ చేయగా కేవలం 49 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. మరోపక్క అభిషేక్ శర్మ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్ తర్వాత తీసుకోలేదు. ఆ మ్యాచ్‌లో అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. గత ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయాల్సి ఉండగా.. కెప్టెన్ మార్క్‌క్రమ్ హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌ను ఓపెనింగ్ పంపించాడు.
ప్రస్తుతం టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 15 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(77), కెప్టెన్ మార్కక్రమ్(50) అద్భుత అర్ధశతకాలు విజృంభించారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రసెల్ 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.