Rohit Disappointment: గుజరాత్‌పై ఓటమిపై రోహిత్ అసంతృప్తి.. పరాజయానికి కారణం చెప్పిన హిట్ మ్యాన్-rohit sharma disappointed with loss against gujarat titans ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma Disappointed With Loss Against Gujarat Titans

Rohit Disappointment: గుజరాత్‌పై ఓటమిపై రోహిత్ అసంతృప్తి.. పరాజయానికి కారణం చెప్పిన హిట్ మ్యాన్

Maragani Govardhan HT Telugu
Apr 26, 2023 06:26 AM IST

Rohit Disappointmen: గుజరాత్ చేతిలో ముంబయి పరాజయం కావడంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడమే తమ ఓటమికి కారణమని స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

Rohit Disappointment: గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 55 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 152 పరుగులకే పరిమితమైంది ముంబయి. గుజరాత్ బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేసి ముంబయి బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా ముంబయి తన ఖాతాలో నాలుగో పరాజయాన్ని వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

"ఈ ఓటమి నిజంగా నిరాశను మిగిల్చింది. 15 ఓవర్ల వరకు మ్యాచ్‌ను మా అదుపులోనే ఉంచుకున్నాం. కానీ చివరి ఓవర్లలో ఎక్కువగా పరుగులు ఇచ్చేశాం. కేవలం వ్యూహాన్ని అమలుపరచడంలో విఫలమయ్యాం. పిచ్‌కు ఏది సరైనదో అది చేయాల్సింది. బ్యాటర్లను కట్టడి చేయలేక పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం." అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం స్పందించాడు.

"ప్రతి జట్టుకు ప్రత్యేకమైన బలం ఉంటుంది. మా టీమ్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఛేధించడంలో మాత్రం విఫలమయ్యాం. ఈ రోజు మాది కాదు. మేము మొదటి నుంచి కష్టపడ్డాం. సరిగ్గా ఆడలేకపోయాం. పిచ్‌పై మంచు ఉంది. మేము బాగా బ్యాటింగ్ చేసి ఉంటే విజయం సాధించి ఉండేవాళ్లమేమో. గత మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్యానికి కూడా చేరువగా వెళ్లాం." అని హిట్ మ్యాన్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ముంబయి 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 152 పరుగులకే పరిమితమైంది. నేహాల్(40), కేమరూన్ గ్రీన్(33) మినహా మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో విజృంభించగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(56) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. చివర్లో అభినవ్(42), మిల్లర్(46), రాహుల్ తెవాతియా(20) మెరుపులు మెరిపించారు.

WhatsApp channel