తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Records In Ipl: తొలి మ్యాచ్‌లోనే రెండు రికార్డుల‌ను నెల‌కొల్పిన ధోనీ - ఆ రికార్డులు ఏవంటే

Dhoni Records In Ipl: తొలి మ్యాచ్‌లోనే రెండు రికార్డుల‌ను నెల‌కొల్పిన ధోనీ - ఆ రికార్డులు ఏవంటే

01 April 2023, 12:15 IST

  • Dhoni Breaks Two Records In Ipl: ఐపీఎల్ 2023 సీజ‌న్ లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన ఆరంభ‌ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో ధోనీ రెండు రికార్డుల‌ను నెల‌కొల్పాడు. ఆ రికార్డులు ఏవంటే...

ధోనీ
ధోనీ

ధోనీ

Dhoni Breaks Two Records In Ipl: ఐపీఎల్2023 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల్ చెన్నై ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్‌తో చెల‌రేగినా మిగిలిన ప్లేయ‌ర్స్ నుంచి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌క‌పోవ‌డంతో చెన్నై ఓట‌మి పాలైంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో శుభ్‌మ‌న్ గిల్ గుజ‌రాత్‌కు విజ‌యాన్ని అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ ఏడు బాల్స్‌లో ఒక సిక్స‌ర్‌, ఓ ఫోర్‌తో ప‌ధ్నాలుగు ర‌న్స్ చేశాడు. అత‌డు కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. కాగా ఈ మ్యాచ్ ద్వారా ధోనీ ఐపీఎల్‌లో రెండు రికార్డుల‌ను తిర‌గ‌రాశాడు.

ధోనీ ఐదో బ్యాట్స్‌మెన్‌

ఐపీఎల్‌లో 200 సిక్స‌ర్లు కొట్టిన ఏకైక చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్‌గా ధోనీ రికార్డ్ సృష్టించాడు. సింగిల్ టీమ్ త‌ర‌ఫున ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు బాదిన ఐదో ప్లేయ‌ర్‌గా ధోనీ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్‌, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి తో పాటు డివిలియ‌ర్స్‌ ఉన్నారు. అంతే కాకుండా ఐపీఎల్ ఆడిన అత్య‌ధిక వ‌య‌స్కుడైన వికెట్ కీప‌ర్‌గా గుజ‌రాత్ మ్యాచ్ ద్వారా ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ రికార్డ్‌ను ధోనీ తిర‌గ‌రాశాడు.

గిల్‌క్రిస్ట్ గ‌తంలో 41 సంవ‌త్స‌రాల 185 రోజుల వ‌య‌సులో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. గుజ‌రాత్ మ్యాచ్‌తో 41 సంవ‌త్స‌రాల 267 రోజుల‌తో అత‌డి రికార్డ్‌ను ధోనీ అధిగ‌మించాడు. ఈ జాబితాలో వృద్ధిమాస్ సాహా మూడో స్థానంలో ఉన్నాడు.

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ…

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా యాభై ప‌రుగులు చేసిన సీఎస్‌కే ఓపెన‌ర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 23 బాల్స్‌లోనే రుతురాజ్ హాఫ్ సెంచ‌రీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా యాభై బాల్స్‌లో తొమ్మిది సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 92 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.