తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Auction Live Telecast Streaming When And Where To Watch

IPL 2023 Auction Timings: ఐపీఎల్ 2023 వేలాన్ని లైవ్‌లో ఎక్కడ, ఎప్పుడు, ఎందులో చూడాలి?

22 December 2022, 22:20 IST

    • IPL 2023 Auction Timings: ఐపీఎల్ 2023 వేలం శుక్రవారం ప్రారంభం కానుంది. కొచ్చి వేదికగా జరగనున్న ఈ వేలం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. 10 ఫ్రాంఛైజీలు 87 స్థానాల కోసం ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి.
ఐపీఎల్ 2023 వేలం ఎక్కడ, ఎందులో చూడాలి
ఐపీఎల్ 2023 వేలం ఎక్కడ, ఎందులో చూడాలి

ఐపీఎల్ 2023 వేలం ఎక్కడ, ఎందులో చూడాలి

IPL 2023 Auction Timings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ కోసం నిర్వహించే మినీ వేలం మరికొన్ని గంట్లలోనే ప్రారంభం కానుంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సందడి ముందే ప్రారంభం కానుంది. మొత్తం 405 మంది క్రికెటర్లు ఈ వేలంలో పోటీ పడుతున్నారు. 10 ఫ్రాంఛైజీలు 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. 2022 డిసెంబరు 23 అంటే శుక్రవారం నాడు ప్రారంభం కానున్న ఈ వేలం కోసం క్రికెట్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ వేలంలో 991 ఆటగాళ్లు నమోదు చేసుకోగా.. వీరిలో 369 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అయితే ఫ్రాంఛైజీల అభ్యర్థన మేరకు కొంతమంది ఆటగాళ్లను చేర్చగా 405 మంది వేలంలో కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మొత్తం 405 మంది ఆటగాళ్లలో273 మంది భారతీయులు ఉండగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. నలుగురు ఐసీసీ సభ్యత్వం కలిసి అసొసియేషన్ దేశాలకు చెందినవారున్నారు. మొత్తం ఆటగాళ్లలో 119 మంది అంతర్జాతీయ ప్లేయర్లు కాగా.. 282 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు. మొత్తం 87 స్థానాల కోసం ఈ వేల జరుగుతుంది. ఇందులో 30 విదేశీ ప్లేయర్ల కోసం కేటాయించడమైంది.

ఆటగాళ్ల అత్యధిక బేస్ ప్రైజ్ వచ్చేసి రూ.2 కోట్లుగా నిర్దేశించారు. 19 మంది విదేశీ క్రికెటర్లు అత్యధిక మొత్తాన్ని తమ బేస్ ప్రైజ్‌గా నిర్దేశించారు. 11 మంది తమ కనీస ధరను రూ.1.5 కోట్లుగా నిర్దేశించారు. మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే సహా 20 మంది ఆటగాళ్లు బేస్ ప్రైజ్‌ను కోటి రూపాయలుగా నమోదు చేశారు.

ఐపీఎల్ 2023 వేలం లైవ్ ఎక్కడ, ఎప్పుడు..

ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించే వేలం కేరళలోని కొచ్చి వేదికగా జరగనుంది. 2022 డిసెంబరు 23 శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది. 10 ఫ్రాంఛేజీలు ఈ వేలం పాల్గొననున్నాయి.

వేలం లైవ్‌లో ఎందులో చూడవచ్చు..

ఐపీఎల్ 2023 వేలాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన అన్నీ ఛానల్లోనూ వీక్షించవచ్చు. అలాగే ఫోన్‌లో చూడాలనుకునేవారికి జియో సినిమా యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత కథనం

టాపిక్