తెలుగు న్యూస్  /  Sports  /  Indian Women's Hockey Team Lose In Semifinals Due To Wrong Decisions By The Referee

Commonwealth Games 2022:హాకీ సెమీస్ లో పోరాడి ఓడిన ఇండియా ఉమెన్స్ టీమ్ - రిఫరీ పొరపాట్లే కారణమా

HT Telugu Desk HT Telugu

06 August 2022, 7:49 IST

  • కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా ఉమెన్స్ హాకీ టీమ్  సెమీస్ లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పెనాల్టీ షూటౌట్ లో 3 - 0 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు అనుకూలంగా రిఫరీలు నిర్ణయాలు తీసుకోవడం వివాదానికి దారితీసింది. 
సవితా పూనియా
సవితా పూనియా (twitter)

సవితా పూనియా

కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా ఉమెన్స్ హాకీ టీమ్ సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత 1- 1 స్కోరు తో మ్యాచ్ సమం కావడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్ లో ఇండియా ఒక్క పాయింట్ కూడా కొట్టలేకపోగా ఆస్ట్రేలియా మూడు గోల్స్ చేసి విజయాన్ని అందుకున్నది. కాగా ఈ మ్యాచ్ లో తొలి పెనాల్టీ కార్నర్ లో ఆస్ట్రేలియా విఫలమైంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

పెనాల్టీ టైమ్ క్లాక్ ఆరంభం కాకపోవడంతో ఆస్ట్రేలియాకు మరో ఛాన్స్ ఇచ్చారు. రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా గోల్ కొట్టింది. రిఫరీ నిర్ణయాలపై భారత ప్లేయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆస్ట్రేలియాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ సంఘటనతో ఇండియన్ ప్లేయర్స్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. పెనాల్లీ షూటౌట్ లో భారత ప్లేయర్స్ లాల్ రెమ్సియామి, నవనీత్ కౌర్, నేహా గోయల్ గోల్ కొట్టడం లో విఫలమయ్యారు.

అంతకుముందు ఆట ప్రారంభమైన ఫస్ట్ క్వార్టర్ లో నే ఆస్ట్రేలియా ప్లేయర్ రెబెకా కొట్టిన గోల్ తో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరును సమం చేసేందుకు ఇండియా ప్లేయర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆస్ట్రేలియా డిఫెన్స్ ను ఛేదించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎటాకింగ్ కు ప్రాధాన్యమిస్తూ పదే పదే భారత గోల్ పోస్ట్ పై దాడులు చేశారు. కానీ భారత గోల్ కీపర్ సవితా అడ్డుగోడగా నిలిచి మ్యాచ్ ను కాపాడింది. మ్యాచ్ లోఓటమి ఖాయం అనుకుంటున్న తరుణంలో సుశీల చాను గోల్ తో ఇండియా స్కోరును సమం చేసింది. ఆట ముగిసే సమయానికి రెండు జట్ల స్కోరు 1 -1 తో టై కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ వెళ్లాల్సివచ్చింది. ఈ పెనాల్టీ షూటౌట్ లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించింది. సెమీస్ ఓ ఇండియా ఓటమి పాలైన బ్రాంజ్ మెడల్ ఆశలు మాత్రం మిగిలే ఉన్నాయి.