తెలుగు న్యూస్  /  Sports  /  India Won The Toss And Chose To Bat First Against South Africa In T20 World Cup

IND vs SA T20 World Cup 2022: టాస్ గెలిచిన రోహిత్ - ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌

30 October 2022, 16:09 IST

  • IND vs SA T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నేడు ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య ఆస‌క్తిక‌ర మ్యాచ్‌ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా
ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా

ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా

IND vs SA T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సౌతాఫ్రికాతో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న టీమ్ ఇండియా సౌతాఫ్రికాపై విజ‌యాన్ని సాధించి సెమీస్ బెర్తు ద‌క్కించుకోవాల‌ని ఆశ‌ప‌డుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

నేటి మ్యాచ్‌లో మ‌రోమారు విరాట్ కోహ్లి చెల‌రేగాల‌ని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రోవైపు సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్‌కు కీల‌కంగా మారింది. అత‌డు ఎలా ఆడుతున్నాది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ప్ర‌యోగాల జోలికి పోకుండా గ‌త మ్యాచ్‌ల‌లో ఆడిన ప్లేయ‌ర్స్‌ను కొన‌సాగించింది. దినేష్ కార్తిక్ స్థానంలో రిష‌బ్ పంత్‌కు స్థానం ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ కార్తిక్‌పైనే రోహిత్ మ‌రోసారి న‌మ్మ‌కం ఉంచాడు. మ‌రోవైపు సౌతాఫ్రికా ఒక మార్పు చేసింది. షంసీ స్థానంలో లుంగి ఎంగిడిని తుది జ‌ట్టులోకి తీసుకున్న‌ది.