తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Indw Vs Slw Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా ఇండియా - ఫైన‌ల్‌లో లంక‌ను చిత్తు చేసిన ఉమెన్స్ టీమ్

INDW vs SLW Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా ఇండియా - ఫైన‌ల్‌లో లంక‌ను చిత్తు చేసిన ఉమెన్స్ టీమ్

15 October 2022, 15:40 IST

  • INDW vs SLW Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో శ్రీలంక‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

స్మృతి మంధాన‌
స్మృతి మంధాన‌

స్మృతి మంధాన‌

INDW vs SLW Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా ఇండియా ఉమెన్స్ టీమ్ నిలిచింది. శ‌నివారం శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్‌ మ్యాచ్‌లో భార‌త మ‌హిళా జ‌ట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఉమెన్స్ టీమ్ 65 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. పేస‌ర్ రేణుక సింగ్ ధాటికి శ్రీలంక బ్యాట‌ర్లు విల‌విల‌లాడారు. మూడు ఓవ‌ర్లు వేసి ఐదు ప‌రుగులు ఇచ్చిన రేణుక సింగ్ మూడు వికెట్లు తీసింది. గైక్వాడ్, స్నేహ్ రాణా త‌లో రెండు వికెట్లు తీశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

66 ప‌రుగుల ల‌క్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా స్మృతి మంధాన మెరుపుల‌తో ఎనిమిది ఓవ‌ర్ల‌లోనే విజ‌యాన్ని అందుకున్న‌ది. స్మృతి మంధాన‌ 25 బాల్స్‌లోనే మూడు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 51 ర‌న్స్ చేసింది. 8.3 ఓవ‌ర్ల‌లో టీమ్ ఇండియా 71 ర‌న్స్ చేసింది.

షెఫాలీ వ‌ర్మ‌, రొడ్రిగ‌స్ విఫ‌ల‌మైన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌తో క‌లిసి స్మృతి మంధాన టీమ్ ఇండియాకు విజ‌యాన్ని అందించింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ ప‌ద‌కొండు ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచింది. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఆసియా క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం ఇది ఏడోసారి కావ‌డం గ‌మ‌నార్హం. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శ‌ర్మ‌, ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రేణుక సింగ్‌కు అవార్డులు ద‌క్కాయి.

టాపిక్