తెలుగు న్యూస్  /  Sports  /  India Womens Beat England Womens By 7 Wickets To Win Under 19 World Cup Title

U-19 World Cup Final IND vs ENG: అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఇండియా - ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌పై ఘ‌న విజ‌యం

29 January 2023, 19:54 IST

  • U-19 World Cup Final IND vs ENG: అండ‌ర్ 19 ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఇండియా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘ‌న‌ విజ‌యాన్ని సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్న‌ది.

ఇండియా ఉమెన్స్ టీమ్‌
ఇండియా ఉమెన్స్ టీమ్‌

ఇండియా ఉమెన్స్ టీమ్‌

U-19 World Cup Final IND vs ENG: అండ‌ర్ 19 ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఇండియా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజ‌యం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ 17.1 ఓవ‌ర్ల‌లో 68 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్స్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఇంగ్లాండ్స్ బ్యాట్స్ ఉమెన్స్‌లో మెక్‌డోనాల్డ్ గే 19 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. స్మాలే, స్టోన్‌హౌజ్ త‌లో 11 ప‌రుగులు చేశారు.

భార‌త బౌల‌ర్ల‌లో టైటాస్ సాధు ఆరు ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. చోప్రా, అర్చ‌న దేవిల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి. స్వ‌ల్ప టార్గెట్‌ను టీమ్ ఇండియా ఈజీగా ఛేదించింది. మ‌రో ఆరు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే విజ‌యాన్ని అందుకున్న‌ది.

షెఫాలీ వ‌ర్మ (15 ర‌న్స్‌), శ్వేత షెర‌వాత్ (5 ర‌న్స్‌) తొంద‌ర‌గానే ఔట్ కావ‌డంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. కానీ సౌమ్య తివారీ (24 ర‌న్స్‌) త్రిష (24 ర‌న్స్‌) చ‌క్క‌టి బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాకు అద్భుత‌ విజ‌యాన్ని అందించారు.

టాపిక్