తెలుగు న్యూస్  /  Sports  /  India Women Lost To Pakistan Women In Asia Cup

Ind w vs Pak w in Asia Cup: టీమిండియాకు షాక్‌.. పాకిస్థాన్‌ చేతుల్లో ఓటమి

Hari Prasad S HT Telugu

07 October 2022, 16:28 IST

    • Ind w vs Pak w in Asia Cup: టీమిండియాకు షాక్‌ తగిలింది. ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడు మీద ఉన్న ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌.. పాకిస్థాన్‌ చేతుల్లో అనూహ్యంగా ఓటమి చవి చూసింది.
ఆసియా కప్ లో ఇండియన్ వుమెన్స్ టీమ్ కు షాకిచ్చిన పాకిస్థాన్
ఆసియా కప్ లో ఇండియన్ వుమెన్స్ టీమ్ కు షాకిచ్చిన పాకిస్థాన్ (PCB twitter)

ఆసియా కప్ లో ఇండియన్ వుమెన్స్ టీమ్ కు షాకిచ్చిన పాకిస్థాన్

Ind w vs Pak w in Asia Cup: మహిళల ఆసియా కప్‌లో ఇండియన్‌ టీమ్‌ జోరుకు బ్రేక్‌ పడింది. శుక్రవారం (అక్టోబర్‌ 7) దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలతో ఊపు మీదుంది. అటు పాకిస్థాన్‌ మాత్రం థాయ్‌లాండ్‌ చేతుల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ టీమ్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే మ్యాచ్‌లో మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. 138 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియన్‌ టీమ్‌ 19.4 ఓవర్లలో 124 రన్స్‌కే ఆలౌటైంది. టీ20 చరిత్రలో పాకిస్థాన్‌ వుమెన్స్‌ టీమ్ ఇండియన్‌ టీమ్‌ను ఓడించడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. ఆ టీమ్‌ ప్లేయర్‌ నిదా దర్‌ ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌లో 56 రన్స్‌ చేయడంతోపాటు రెండు వికెట్లు కూడా తీసింది.

ఇండియన్‌ టీమ్‌ స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధానా (17), జెమీమా (2), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12), హేమలత (20) నిరాశ పరిచారు. చివర్లో వికెట్ కీపర్‌ రిచా ఘోష్‌ కాసేపు మెరుపులు మెరిపించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. ఆమె కేవలం 15 బాల్స్‌లోనే 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 26 రన్స్‌ చేసింది. అయితే 19వ ఓవర్లో ఆమె ఔట్‌ కావడంతో పాక్‌ ఊపిరి పీల్చుకుంది. పాక్‌ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు తీయగా.. సాదియా, నిదా చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌.. నిదా దర్‌(56), కెప్టెన్‌ బిస్మా మరూఫ్‌ (32) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 రన్స్‌ చేసింది. ఒక దశలో 33 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయినా.. నాలుగో వికెట్‌కు ఈ ఇద్దరూ 76 రన్స్‌ జోడించి ఆదుకున్నారు. ప్రస్తుతం ఆసియా కప్ పాయింట్ల టేబుల్లో నాలుగు మ్యాచ్ లలో మూడు విజయాలతో ఇండియా టాప్ లో కొనసాగుతోంది. పాకిస్థాన్ కూడా మూడు విజయాలతో రెండో స్థానంలో ఉంది.