తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Nz 1st Odi: ఇండియా తుది జట్టు అంచనా.. సంజూ శాంసన్‌, పంత్‌లలో ఎవరికి ఛాన్స్‌?

India vs NZ 1st ODI: ఇండియా తుది జట్టు అంచనా.. సంజూ శాంసన్‌, పంత్‌లలో ఎవరికి ఛాన్స్‌?

Hari Prasad S HT Telugu

24 November 2022, 19:44 IST

  • India vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో ఇండియా తొలి వన్డే శుక్రవారం (నవంబర్‌ 25) జరగనుంది. మరి తుది జట్టులో ఎవరుంటారు? రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లలో ఎవరికి ఛాన్స్‌ ఇస్తారు?

కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్
కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ (PTI)

కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్

India vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో ఇండియా మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో గెలిచినా తుది జట్టు ఎంపికపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌ విఫలమవుతున్నా అతన్నే కొనసాగించడం, సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వకపోవడంపై చాలా మంది పెదవి విరిచారు. దీంతో న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తుది జట్టు ఎంపిక ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇప్పుడు కెప్టెన్‌ మారాడు. హార్దిక్‌ పాండ్యా ఇంటికి వచ్చేయగా.. వన్డే టీమ్‌ను శిఖర్‌ ధావన్ లీడ్‌ చేయబోతున్నాడు. పాండ్యాతోపాటు ఇషాన్‌ కిషన్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌లాంటి వాళ్లు కూడా ఇంటికి వచ్చేశారు. దీంతో టీ20 టీమ్‌తో పోలిస్తే ఈ టీమ్‌ పూర్తి భిన్నంగా కనిపించనుంది. అయితే పంత్‌, సంజూలలో ధావన్‌ ఎవరికి ఓటేస్తాడన్నది ఆసక్తిగా మారింది. కాకపోతే టీ20 టీమ్‌లాగే ఈ టీమ్‌కు కూడా పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. మరి అతన్ని పక్కన పెట్టే సాహసం చేస్తారా అన్నది అనుమానమే.

ఆ లెక్కన టీ20ల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు ఈసారి కూడా చోటు అనుమానమే. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో ఒకేసారి భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. పేస్‌ బౌలింగ్‌ భారాన్ని అర్ష్‌దీప్‌ సింగ్, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌ మోయనున్నారు. ఇక స్పిన్నర్లలో కుల్దీప్‌, వాసింగ్టన్ సుందర్‌ ఉంటారు. చహల్‌కు ఈసారీ ఛాన్స్‌ కష్టంగానే కనిపిస్తోంది.

ఇక బ్యాటింగ్‌లో ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా వస్తారు. మూడో స్థానంలో సూర్య, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌, పంత్, హుడాలు రావచ్చు. హుడా, సుందర్‌ల రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉండటం టీమ్‌కు ప్లస్‌ పాయింట్‌.

ఇండియా తుది జట్టు అంచనా: శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌, శార్దూల్‌, దీపక్‌ చహర్‌, అర్ష్‌దీప్‌