తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Aus 2nd Odi: రెండో వ‌న్డేకు వ‌రుణుడి ముప్పు? - మ్యాచ్ జ‌ర‌గ‌డం అనుమాన‌మే

IND vs AUS 2nd Odi: రెండో వ‌న్డేకు వ‌రుణుడి ముప్పు? - మ్యాచ్ జ‌ర‌గ‌డం అనుమాన‌మే

19 March 2023, 8:31 IST

  • IND vs AUS 2nd Odi: విశాఖ వేదిక‌గా ఆదివారం (నేడు) ఇండియా ఆస్ట్రేలియా మ‌ధ్య రెండో వ‌న్డే జ‌రుగ‌నుంది. వ‌ర్షం ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఈ వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌డం అనుమానంగా మారింది.

రోహిత్ శ‌ర్మ
రోహిత్ శ‌ర్మ

రోహిత్ శ‌ర్మ

IND vs AUS 2nd Odi: విశాఖ వేదిక‌గా ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య ఆదివారం (నేడు) రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు పొంచి ఉంది. విశాఖ‌లో శ‌నివారం నుంచి భారీ వ‌ర్షం కురుస్తోన్న నేప‌థ్యంలో రెండో వ‌న్డే స‌జావుగా సాగుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ్యాచ్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సిరీస్ సొంతం చేసుకోవాల‌నే ఉత్సాహంతో...

తొలి వ‌న్డేలో అద్భుత విజ‌యాన్ని సాధించిన టీమ్ ఇండియా రెండో వ‌న్డేలో ఆ జోరును కొన‌సాగించి సిరీస్ సొంతం చేసుకోవాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల తొలి వ‌న్డేకు దూర‌మైన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) రెండో వ‌న్డే కోసం తిరిగి జ‌ట్టులోకి చేర‌నున్నాడు.

రోహిత్ జ‌ట్టులోకి వ‌స్తే ఇషాన్‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం ఖాయ‌మే. టీ20ల్లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో చెల‌రేగుతోన్న సూర్య‌కుమార్ వ‌న్డేల్లో మాత్రం ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ను పున‌రావృతం చేయ‌లేక‌పోతున్నాడు. అత‌డితో పాటు కోహ్లి (Virat Kohli)కూడా విశాఖ వ‌న్డేలో రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

రాహుల్ ఖాయ‌మే...

తొలి వ‌న్డేలో ఓట‌మి బాట‌లో ప‌య‌నిస్తోన్న టీమ్ ఇండియాను చ‌క్క‌టి ఇన్నింగ్స్‌తో గ‌ట్టెక్కించిన కేఎల్ రాహుల్ తుది జ‌ట్టులో త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొడుతోన్న జ‌డేజాను మ‌రోసారి రాణిస్తే ఆసీస్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. బౌలింగ్‌లో తొలి వ‌న్డేలో పేస‌ర్లు ష‌మీ, సిరాజ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర‌చ‌డం టీమ్ ఇండియాకు సానుకూలంశంగా మారింది.

వార్న‌ర్ ఎంట్రీ...

మ‌రోవైపు తొలి వ‌న్డేలో బ్యాటింగ్ త‌డ‌బాటుతో ఓట‌మి పాలైంది ఆస్ట్రేలియా. ఆ పొర‌పాట్లు రెండో వ‌న్డేలో చేయ‌కుండా ఉండ‌టంపై దృష్టిసారిస్తోంది. ఆసీస్ బ్యాటింగ్ భారం మిచెల్ మార్ష్‌తో పాటు కెప్టెన్ స్మిత్‌పైనే ఎక్కువ‌గా ఉంది. రెండో వ‌న్డే కోసం వార్న‌ర్ బ‌రిలో దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝులిపించాల్సిన అవ‌స‌రం ఉంది.