తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz 2nd T20: స్పిన్న‌ర్ల ధాటికి కివీస్ విల‌విల - టీమ్ ఇండియా టార్గెట్ 100 ర‌న్స్‌

IND vs NZ 2nd T20: స్పిన్న‌ర్ల ధాటికి కివీస్ విల‌విల - టీమ్ ఇండియా టార్గెట్ 100 ర‌న్స్‌

29 January 2023, 20:57 IST

  • IND vs NZ 2nd T20: రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త స్పిన్ బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 99 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. టీమ్ ఇండియా ముందు ఈజీ టార్గెట్‌ను విధించింది.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

IND vs NZ 2nd T20: ల‌క్నో వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. టీమ్ ఇండియా స్పిన్న‌ర్ల ధాటికి న్యూజిలాండ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 99 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. భార‌త జ‌ట్టు ముందు స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని విధించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఓపెన‌ర్లు ఫిన్ అలెన్‌, డెవాన్ కాన్వే ధాటిగానే న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ఆర‌భించారు. కానీ వారి జోరును చాహ‌ల్ అడ్డుకున్నాడు. తాను వేసిన తొలి ఓవ‌ర్‌లోనే ఫిన్ అలెన్‌(11 ర‌న్స్‌)ను ఔట్ చేశాడు. ఆ ఓవ‌ర్ మెయిడిన్ కావ‌డంతో న్యూజిలాండ్ స్కోరు వేగం త‌గ్గింది.

ఆ త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్‌, దీప‌క్ హుడా స్పిన్ ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బందులు ప‌డ్డారు. చాప్‌మ‌న్ (14 ప‌రుగులు) బ్రాస్‌వెల్‌(14 ర‌న్స్) మాత్ర‌మే కాసేపు నిల‌దొక్కుకున్నారు. మిగిలిన బ్యాట్స్‌మ్సెన్స్ సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యారు.

కెప్టెన్ శాంట్న‌ర్ 20 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కాగా తొలి టీ20 మ్యాచ్‌లో ధారాళంగా ప‌రుగులు ఇచ్చి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న అర్ష‌దీప్ సింగ్ రెండో టీ20లో మాత్రం ఒకే ఓవ‌ర్ వేసి మూడు ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

చాహ‌ల్ రెండు ఓవ‌ర్లు వేసి నాలుగు ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు. అత‌డితో పాటు హార్దిక్ పాండ్య, దీప‌క్ హుడా, సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్ ల‌కు త‌లో ఒక్క వికెట్ ద‌క్కింది.