తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Sa Virat Kohli Eyes On Rare Record In T20 World Cup

IND vs SA: నేడు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ - రికార్డ్‌పై క‌న్నేసిన కోహ్లి

30 October 2022, 11:47 IST

  • IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నేడు సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా త‌ల‌ప‌డ‌బోతున్న‌ది. ఈ మ్యాచ్‌లో అంద‌రి దృష్టి విరాట్ కోహ్లి పైనే ఉంది. ఈ మ్యాచ్‌తో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత‌డు ఓ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది. ఆ రికార్డ్ ఏదంటే...

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న‌ది రోహిత్ సేన‌. పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య చివ‌రి బాల్‌కు గ‌ట్టెక్కింది టీమ్ ఇండియా. నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సుల‌భంగా విజ‌యాన్ని అందుకొంది. నేడు సౌతాఫ్రికాతో పోరుకు సిద్ధ‌మైంది. హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకోవాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. పాకిస్థాన్‌, నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌ల‌లో హాఫ్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టిన విరాట్ కోహ్లిపైనే క్రికెట్ అభిమానుల దృష్టి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అత‌డు ఎలా ఆడుతాడో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రో 28 ప‌రుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన క్రికెట‌ర్‌గా కోహ్లి నిలుస్తాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డ్ శ్రీలంక మాజీ క్రికెట‌ర్ మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే పేరుమీద ఉన్న‌ది. 31 మ్యాచుల్లో జ‌య‌వ‌ర్ధ‌నే 1016 ర‌న్స్ చేశాడు. ప్ర‌స్తుతం కోహ్లి 23 మ్యాచుల్లో 989 ర‌న్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. మ‌రో 28 ర‌న్స్ చేస్తే జ‌య‌వ‌ర్ధ‌నే రికార్డ్‌ను బ్రేక్ చేసి కోహ్లి టాప్ ప్లేస్‌లోకి చేరుకుంటాడు.

గ‌త రెండు మ్యాచ్‌ల‌లో కె.ఎల్ రాహుల్ విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రోసారి అత‌డికి ఛాన్స్ ఇస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ‌తో పాటు సూర్య‌కుమార్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

కార్తిక్‌ను ప‌క్క‌న‌పెట్టి తుది జ‌ట్టులోకి పంత్‌ను తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పేస‌ర్లుగా భువ‌నేశ్వ‌ర్‌, అర్ష‌దీప్‌సింగ్‌, ష‌మీపైనే బౌలింగ్ భారం ఉంది. మ‌రోవైపు సౌతాఫ్రికాను కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. డికాక్‌, రూసో, మార్‌క్ర‌మ్‌, మిల్ల‌ర్ లాంటి హిట్ట‌ర్ల‌తో జ‌ట్టు బ‌లంగా ఉంది.