తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Nz 3rd Odi Team India Eyes On Number One Place In Odi Rankings

Icc Odi Ranking Team India: మూడో వ‌న్డేలో గెలిస్తే టీమ్ ఇండియానే నంబ‌ర్ వ‌న్‌

22 January 2023, 18:04 IST

  • Icc Odi Ranking Team India: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకోవ‌డానికి అడుగు దూరంలో టీమ్ ఇండియా నిలిచింది. మంగ‌ళ‌వారం న్యూజిలాండ్‌తో జ‌రుగ‌నున్న మూడో వ‌న్డేలో టీమ్ ఇండియా గెలిస్తే నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌కు చేరుకుంటుంది.

టీమ్ ఇండియా
టీమ్ ఇండియా

టీమ్ ఇండియా

Icc Odi Ranking Team India: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా నంబ‌ర్ వ‌న్ స్థానంపై క‌న్నేసింది. జ‌న‌వ‌రి 24న ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో మూడో వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌కు చేరుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ప్ర‌స్తుతం వ‌న్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ టాప్ ప్లేస్‌లో ఉండ‌గా రెండో స్థానంలో న్యూజిలాండ్‌, మూడో స్థానంలో ఇండియా ఉన్నాయి. మూడు టీమ్‌లు 113 పాయింట్ల‌తో స‌మానంగా ఉన్నాయి.

ఒక‌వేళ మూడో వ‌న్డేలో టీమ్ ఇండియా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే 115 పాయింట్ల‌తో ఇంగ్లాండ్‌ను అధిగ‌మిస్తూ టీమ్ ఇండియా నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంటుంది.

న్యూజిలాండ్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ గ‌ల్లంతు

రాయ్‌పుర్ వేదిక‌గా శ‌నివారం జ‌రిగిన రెండో వ‌న్డేకు ముందు వ‌న్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉండ‌గా ఇండియా నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలు కావ‌డంతో నంబ‌ర్ వ‌న్ ప్లేస్ నుంచి రెండో స్థానానికి ప‌డిపోయింది.

మ‌రోవైపు నాలుగో స్థానంలో ఉన్న ఇండియా ఈ విజ‌యంతో ఆస్ట్రేలియాను అధిగ‌మిస్తూ థ‌ర్డ్ ప్లేస్‌కు చేరుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. ఈ టార్గెట్‌ను టీమ్ ఇండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.