తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australia Squad For Odi Series: ఇండియాతో వ‌న్డే సిరీస్ ఆడ‌నున్న ఆస్ట్రేలియా టీమ్ ఇదే - కెప్టెన్‌గా స్మిత్‌

Australia Squad For Odi Series: ఇండియాతో వ‌న్డే సిరీస్ ఆడ‌నున్న ఆస్ట్రేలియా టీమ్ ఇదే - కెప్టెన్‌గా స్మిత్‌

15 March 2023, 8:17 IST

  • Australia Squad For Odi Series: భార‌త్‌తో జ‌రుగ‌నున్న వ‌న్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ను మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా వ‌న్డే జ‌ట్టుకు స్మిత్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

స్మిత్
స్మిత్

స్మిత్

Australia Squad For Odi Series: టీమ్ ఇండియా చేతిలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా వ‌న్డే స‌మ‌రానికి సిద్ధ‌మైంది. టెస్టుల్లో ఎదురైన ప‌రాజ‌యానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నే ల‌క్ష్యంతో బ‌ల‌మైన టీమ్‌తో బ‌రిలో దిగుతోంది. ఇండియాతో వ‌న్డే సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్న ఆస్ట్రేలియా టీమ్‌ను మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ప‌రువు కాపాడిన సీనియ‌ర్ ప్లేయ‌ర్ స్మిత్‌పై మ‌రోసారి న‌మ్మ‌కాన్ని ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్ అత‌డికే కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించింది. వ‌న్డేజ‌ట్టుకు ప్యాట్ క‌మిన్స్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాల్సింది. కానీ కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా అత‌డు సిరీస్‌కు దూరం కావ‌డంతో స్మిత్ ను కెప్టెన్‌గా ఎంపిక‌చేశారు.

గాయం కార‌ణంగా టెస్ట్ సిరీస్‌కు దూర‌మైన డేవిడ్ వార్న‌ర్ వ‌న్డేలు ఆడ‌నున్నాడు. మ్యాక్స్‌వెల్‌, రిచ‌ర్డ్‌స‌న్ లాంటి హిట్ట‌ర్ల‌ను ఎంపిక‌చేశారు. మార్చి 17 నుంచి 22 వ‌ర‌కు వ‌న్డే సిరీస్ జ‌రుగ‌నుంది. తొలి వ‌న్డేకు ముంబాయిలోని వాంఖ‌డే స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

ఆస్ట్రేలియా వ‌న్డే జ‌ట్టు ఇదే

స్మిత్ (కెప్టెన్‌), సీన్ అబాట్‌, ఆస్ట‌న్ అగ‌ర్‌, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్‌, ట్రావిస్ హెడ్‌, జోష్ ఇంగ్లీస్‌, మార్క‌స్ ల‌బుషేన్‌, మిచెల్ మార్ష్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, రిచ‌ర్డ్‌స‌న్‌, స్టార్క్‌, స్టోయినిస్‌, ఆడ‌మ్ జంపా, డేవిడ్ వార్న‌ర్‌...