తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Test Ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు నాలుగోస్థానం - కోహ్లి డౌన్‌

Icc Test Ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు నాలుగోస్థానం - కోహ్లి డౌన్‌

28 December 2022, 19:01 IST

  • Icc Test Ranking: బుధ‌వారం ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌ బౌల‌ర్ల‌ జాబితాలో అశ్విన్ ఐదో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. కోహ్లి ర్యాంక్ మ‌రింత దిగ‌జారింది.

అశ్విన్
అశ్విన్

అశ్విన్

Icc Test Ranking: బుధ‌వారం ఐసీసీ విడుద‌ల‌చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అద‌ర‌గొట్టాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న అశ్విన్ బౌలింగ్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ జాబితాలో టాప్ ఫైవ్‌లో బుమ్రా, అశ్విన్ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. బుమ్రా నాలుగో స్థానంలో నిల‌వ‌గా అశ్విన్ ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో టాప్ ప్లేస్‌లో పాట్ క‌మిన్స్ నిలిచాడు. సెకండ్ ర్యాంక్‌ను అండ‌ర్స‌న్ ద‌క్కించుకోగా థ‌ర్డ్ ర్యాంక్‌లో కాసిగో ర‌బాడా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రిష‌బ్ పంత్ - 6వ ర్యాంక్‌

ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో బ్యాట‌ర్ల జాబితాలో టాప్ టెన్‌లో ఇద్ద‌రు ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌కు మాత్ర‌మే చోటు ద‌క్కింది. రిష‌బ్ పంత్ ఆరో ర్యాంక్‌లో నిల‌వ‌గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 9వ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో విఫ‌ల‌మైన కోహ్లి ర్యాంక్ మ‌రింత దిగ‌జారింది. 12వ స్థానం నుంచి 14వ స్థానానికి కోహ్లి ప‌డిపోయాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో రాణించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ 16వ స్థానంలో నిలిచాడు.

ఆల్ రౌండ‌ర్స్‌లో జ‌డేజా ఫ‌స్ట్ - అశ్విన్ సెకండ్‌

ఆల్ రౌండ‌ర్స్ జాబితాలో 369 పాయింట్ల‌తో ర‌వీంద్ర జ‌డేజా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. 343 పాయింట్ల‌తో అశ్విన్‌కు రెండో స్థానం ద‌క్క‌గా మూడో ప్లేస్‌లో బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ నిలిచాడు.