తెలుగు న్యూస్  /  Sports  /  Harbhajan Singh Alleges Illegal Activities By Punjab Cricket Association Chief

Harbhajan Singh on PCA Chief: పంజాబ్ క్రికెట్ ఛీఫ్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు.. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై లేఖ

07 October 2022, 19:25 IST

    • Harbhajan Singh Alleges on PCA Chief: జీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పీసీఏ ఛీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కొత్త సభ్యత్వాలను అందించడంలో పీసీఏ అధ్యక్షుడు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు ఆరోపించారు.
హర్బజన్ సింగ్
హర్బజన్ సింగ్ (PTI)

హర్బజన్ సింగ్

Harbhajan Singh Letter on PCA Chief: పంజాబ్ క్రికెట్ అసొసియేషన్‌లో(PCA) అవినీతి కలకలం రేగింది. సదరు బోర్డు ముఖ్య సలహాదారు, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పీసీఏ ఛీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కొత్త సభ్యత్వాలను అందించడంలో పీసీఏ అధ్యక్షుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, సదరు స్టేట్ బాడీలోని వాటాదారులకు బహిరంగ లేఖ రాశారు. సంస్థ సమగ్రతను కాపాడేందేకు పీసీఏ సభ్యులు, వాటాదారులు అందరూ కలిసి రావాలని, ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ఆపాలని హర్భజన్ సింగ్ కోరారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ లేఖలో హర్బజన్ సింగ్.. పీసీఏ అధ్యక్షుడు గుల్జారీందర్ సింగ్ చాహల్‌పై బలమైన ఆరోపణలు చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న తనకు గత 10 రోజులుగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఇలాంటివి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్, స్ఫూర్తి, పారదర్శకతకు విరుద్ధమని, తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

“గత వారం, 10 రోజుల నుంచి పంజాబ్‌లోకి క్రికెట్ ప్రేమికులు, ఇతర వాటాదారుల నుంచి పీసీఏ అధ్యక్షుడిపై ఫిర్యాదులు వచ్చాయి. ఆయన చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, సంస్థ పారదర్శకత, స్ఫూర్తికి ఇవి విరుద్ధమని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంబుడ్స్‌మన్‌కు కంప్లైట్ చేసినట్లు నాకు తెలిసింది.” అని హర్భజన్ తన లేఖలో స్పష్టం చేశారు.

ఈ విషయంపై హర్భజన్ మాట్లాడుతూ.. ఓటింగ్ హక్కులను కలిగి ఉన్న 150 మంది సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఈ ప్రవేశాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి తనను సంప్రదించలేదని, బీసీసీఐ రాజ్యాంగానికి మార్గదర్శకాలు, క్రీడా సంస్థల నిర్వహణలో పారదర్శకత, నైతిక ఉల్లఘనలకు ఇవి విరుద్ధమని ఆయన అన్నారు.

హర్బజన్ సింగ్ పంజాబ్ క్రికెట్ అసొసియేషన్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అంతేకాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అతడు 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. అదే విధంగా 2011 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌లోనూ ఆడాడు. 2021లో హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. తన కెరీర్‌లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.

టాపిక్