తెలుగు న్యూస్  /  Sports  /  Ganguly Rings Warning Bell For Pujara And Says He Need To Be At His Best

Ganguly Warning Bell to Indian Star: సీనియర్ క్రికెటర్‌పై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. సెంచరీ చేసినా సరిపోదని స్పష్టం

08 February 2023, 11:42 IST

  • Ganguly Warning Bell to Indian Star: పుజారా టెస్టు జట్టులో కీలక ఆటగాడనే సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. టెస్టు సెంచరీ కంటే కూడా ఇంకా మెరుగ్గా ప్రదర్శన చేయాలని స్పష్టం చేశాడు.

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్

Ganguly Warning Bell to Indian Star: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గత కొన్నేళ్లుగా టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును సైతం ఓడిస్తూ దూసుకెళ్తోంది. మళ్లీ ఇప్పుడు టెస్టు సమరానికి సిద్ధమైంది. ఇప్పుడు మరోసారి ఇరుజట్లు సమయాత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 9న తొలి టెస్టు నాగ్‌పుర్ వేదికగా ప్రారంభం కానుంది. దీంతో ఆసీస్‌పై పైచేయి సాధించాలని టీమిండియా యోచిస్తోంది. అయితే అందరి కళ్లు భారత టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారాపైనే ఉన్నాయి. ఎందుకంటే దిల్లీ వేదికగా జరిగే మ్యాచ్ అతడు తన కెరీర్‌లో వందో టెస్టు ఆడనున్నాడు. ఇదిలా ఉంటే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పుజారాపై స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"పుజారా దిల్లీలో జరిగే టెస్టుతో వందో మ్యాచ్ ఆడబోతున్నాడు. అది అతడి కెరీర్‌లో గొప్ప మైలురాయి. వందో టెస్టు ఆడబోతున్న 13వ భారత ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోనున్నాడు. ఈ ఘనతకు పూర్తిగా అతడు అర్హుడు. అయితే అతడు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. గత మూడేళ్లుగా అతడు పెద్దగా రాణించలేదు. టెస్టు సెంచరీ కంటే కూడా ఉత్తమంగా ఆడాలి. ఇది పూజారాకు పెద్ద సిరీస్." అని గంగూలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఆస్ట్రేలియాపై పుజారాకు మెరుగైన గణాంకాలు ఉన్నాయి. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 2018-19 నుంచి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ద74.43 సగటుతో 521 పరుగులతో లీడింగ్ స్కోరర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బోర్డర్-గవాస్కర్ ఎడిషన్‌లో మాత్రం అతడు విఫలమయ్యాడు. దీంతో పుజారాపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

అయితే గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పుజారా ఆకట్టుకున్నాడు. 130 బంతుల్లో 102 పరుగులతో తన శైలికి విరుద్ధంగా ఆడి రాణించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేయడం పుజారాకు ఇదే తొలిసారి.