తెలుగు న్యూస్  /  Sports  /  Fifa World Cup Day 8 Schedule Japan Eyes Knockout Stage

Fifa World Cup Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే - జ‌పాన్ నాకౌట్ చేరుకుంటుందా

27 November 2022, 10:56 IST

  • Fifa World Cup Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నేడు (న‌వంబ‌ర్ 27) మూడు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి మ్యాచ్ జ‌పాన్‌, కోస్టారికా మ‌ధ్య జ‌రుగ‌నుంది.  బెల్జియంతో మొరాకో,  క్రొయేషియాతో కెన‌డా పోరుకు సిద్ధ‌మ‌య్యాయి.

జ‌పాన్‌ వర్సెస్ కోస్టారికా
జ‌పాన్‌ వర్సెస్ కోస్టారికా

జ‌పాన్‌ వర్సెస్ కోస్టారికా

Fifa World Cup Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో స‌మ‌రం ఆస‌క్తిక‌రంగా మారుతోంది. నాకౌట్ రేసు స‌మీక‌ర‌ణాలు తారుమారు అవుతుండ‌టం ఉత్కంఠను కలిగిస్తోంది. ఆదివారం మూడు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో కోస్టారికాతో జ‌పాన్ త‌ల‌ప‌డ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఆరంభ పోరులో జ‌ర్మ‌నీని చిత్తు చేసింది జ‌పాన్‌. కోస్టారికాపై విజ‌యాన్ని సాధించి నాకౌట్ బెర్తును ఖ‌రారు చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో బ‌రిలో దిగుతోంది. వ‌టారు ఎండో, గొండాపైనే జ‌పాన్ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ది. మ‌రోవైపు తొలి మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 7-0తో భంగ‌పాటుకు గురైంది కోస్టారికా. జ‌పాన్‌పై గెలిచి ప‌రువు నిలుపుకోవాల‌ని భావిస్తోంది.

బెల్జియం వర్సెస్ మొరాకో…

గ్రూప్ ఎఫ్‌లో భాగంగా ఆదివారం బెల్జియం, మొరాకో మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది. కెన‌డాపై విజ‌యాన్ని సాధించిన బెల్జియం గ్రూప్ ఎఫ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.మొరాకోపై విజ‌యాన్ని సాధిస్తే బెల్జియం నాకౌట్ బెర్తు దాదాపు ఖాయ‌మైన‌ట్లే. ఫస్ట్ మ్యాచ్ హీరో మిషే బ‌ట్షువాయి మ‌రోసారి చెల‌రేగాల‌ని బెల్జియం అభిమానులు కోరుకుంటున్నారు.

గ్రూప్ ఎఫ్‌లోనే మ‌రో మ్యాచ్‌లో క్రోయేషియాతో కెన‌డా పోరుకు రెడీ అయ్యింది. ఈ మ్యాచ్‌లో విజయాన్ని సాధిస్తే గ్రూప్ ఎఫ్ నుంచి నాకౌట్ చేరుకునే అవకాశం ఉన్న మ‌రో జ‌ట్టుగా క్రియేషియా నిలుస్తుంది. ఒక‌వేళ కెన‌డా విజ‌యం సాధిస్తే నాకౌట్ రేసు ఆస‌క్తిక‌రంగా మారుతుంది.