తెలుగు న్యూస్  /  Sports  /  Fifa World Cup 2022 Ronaldo Goal Or Not Answers Adidas With Their Ball Technology

FIFA World Cup 2022 Ronaldo Goal: ఆ గోల్‌ రొనాల్డోది కాదు.. బాల్‌ టెక్నాలజీతో తేల్చిన అడిడాస్‌

Hari Prasad S HT Telugu

29 November 2022, 18:13 IST

    • FIFA World Cup 2022 Ronaldo Goal: ఆ గోల్‌ రొనాల్డోది కాదని బాల్‌ టెక్నాలజీ సాయంతో బాల్‌ను తయారు చేసిన అడిడాస్‌ సంస్థ తేల్చింది. ఇంతకీ అడిడాస్‌ ఈ విషయాన్ని ఎలా చెప్పగలిగింది?
బ్రూనో ఫెర్నాండెజ్, క్రిస్టియానో రొనాల్డో
బ్రూనో ఫెర్నాండెజ్, క్రిస్టియానో రొనాల్డో

బ్రూనో ఫెర్నాండెజ్, క్రిస్టియానో రొనాల్డో

FIFA World Cup 2022 Ronaldo Goal: పోర్చుగల్, ఉరుగ్వే మధ్య సోమవారం (నవంబర్‌ 28) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌ తరఫున తొలి గోల్‌ ఎవరు చేశారన్న చర్చ ప్రస్తుతం ట్విటర్‌లో హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఈ గోల్ పోర్చుగల్‌ ప్లేయర్‌ బ్రూనో ఫెర్నాండెజ్‌కు ఇచ్చారు. అయితే ఆ గోల్‌ తనదని, అది నెట్‌లోకి వెళ్లే ముందు తాను తలతో నెట్టినట్లు రొనాల్డో వాదించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఒకవేళ ఈ గోల్ రొనాల్డోకు ఇచ్చి ఉంటే అతడు వరల్డ్‌కప్‌లలో పోర్చుగల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచేవాడు. కానీ ఈ గోల్‌ తనకు దక్కకపోవడంపై రొనాల్డో అసంతృప్తి వ్యక్తం చేస్తూ మ్యాచ్ తర్వాత ఫిర్యాదు కూడా చేశాడు. కానీ ఇప్పుడు అధికారిక బాల్‌ అయిన అల్‌ రిహ్లాను తయారు చేసిన అడిడాస్‌ సంస్థ ఆ గోల్‌ ఎవరు చేశారో తమ బాల్‌ టెక్నాలజీ సాయంతో తేల్చి చెప్పింది.

మ్యాచ్‌ 54వ నిమిషంలో ఈ ఘటన జరిగింది. దూరం నుంచి ఫెర్నాండెజ్‌ కిక్‌ చేసిన బాల్‌ ఉరుగ్వే గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టించి నెట్‌లోకి వెళ్లింది. అయితే మధ్యలో రొనాల్డో గాల్లోకి లేస్తూ తలతో బాల్‌ను నెట్టే ప్రయత్నం చేశాడు. గోల్‌ అయిన తర్వాత అది తనదే అని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. కానీ స్క్రీన్‌పై అది ఫెర్నాండెజ్‌ గోల్‌ అని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దీనిపై స్పందించిన అడిడాస్ సంస్థ ఆ గోల్‌ రొనాల్డో చేయలేదని తేల్చింది. తమ బాల్‌ టెక్నాలజీ సాయంతో ఈ విషయం కనిపెట్టినట్లు చెప్పింది. "పోర్చుగల్‌, ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో అల్ రిహ్లా అధికారిక మ్యాచ్‌ బాల్‌లో ఏర్పాటు చేసిన బాల్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నాం. తొలి గోల్‌లో బాల్‌ అసలు రొనాల్డోకు తగల్లేదని తేలింది. ఆ బాల్‌ నెట్‌లోకి వెళ్లడానికి రొనాల్డో నుంచి ఎలాంటి బలం ప్రయోగించలేదని దానికి అటాచ్‌ చేసిన గ్రాఫిక్ తేల్చింది. బాల్‌లో అమర్చిన 500 హెర్ట్జ్‌ ఐఎంయూ సెన్సర్‌ మా విశ్లేషణను అత్యంత కచ్చితత్వంతో చేసేలా ఉపయోగపడుతుంది" అని అడిడాస్‌ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఈ గోల్‌ విషయంలో మంగళవారం ఉదయం నుంచి ట్విటర్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. తాను చేయని గోల్‌ను తనదిగా రొనాల్డో చెప్పుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు. రీప్లేల్లోనూ రొనాల్డో తన తలతో బాల్‌ను కొట్టలేదని తేలింది.