తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Argentina Vs Mexico: మెస్సీ మ్యాజిక్ - అర్జెంటీనా నాకౌట్ ఆశ‌లు స‌జీవం

Argentina vs Mexico: మెస్సీ మ్యాజిక్ - అర్జెంటీనా నాకౌట్ ఆశ‌లు స‌జీవం

27 November 2022, 14:11 IST

  • Argentina vs Mexico: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అర్జెంటీనా నాకౌట్ఆశ‌లు స‌జీవంగా మిగిలాయి. శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో మెక్సికోపై అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా త‌ర‌ఫున మెస్సీ, ఫెర్నాండేజ్ గోల్స్ చేశారు.

మెస్సీ
మెస్సీ

మెస్సీ

Argentina vs Mexico: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ గ్రూప్ మ్యాచ్‌లో తొలి పోరులోనే సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓట‌మి పాలైన సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలో దిగిన అర్జెంటీనా మొద‌టి మ్యాచ్‌లోనే ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో అభిమానులు నిరాశ‌ప‌డ్డారు. ఈ ఓట‌మి నుంచి తేరుకున్న మెస్సీ సేన శ‌నివారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో మెక్సికోపై 2-0 తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

నాకౌట్ ఆశ‌లు స‌జీవంగా ఉండాల‌ంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్జెంటీనా స్ఫూర్తిదాయక పోరాటాన్ని క‌న‌బ‌రిచింది. మ్యాచ్ ఆరంభంలో అర్జెంటినాకు మెక్సికో గ‌ట్టిపోటీ ఇచ్చింది. దాంతో ఫ‌స్ట్ హాఫ్‌లో ఇరు జ‌ట్లు స్కోరు చేయ‌లేక‌పోయాయి. ఈ టెన్ష‌న్‌కు తెర‌దించుతూ 65వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి అర్జెంటీనా అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మెస్సీకి ఇది రెండో గోల్‌. సౌదీ అరేబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఒక గోల్ సాధించాడు. 87వ నిమిషంలో ఏంజో ఫెర్నాండేజ్ మ‌రో గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

మార‌డోనా రికార్డ్‌ను స‌మం చేసిన మెస్సీ

మెక్సికోతో జ‌రిగిన మ్యాచ్ ద్వారా మెస్సీ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డ్‌ను నెల‌కొల్పాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో 21 మ్యాచ్‌లు ఆడిన ప్లేయ‌ర్‌గా మార‌డోనా రికార్డ్‌ను మెస్సీ స‌మం చేశాడు. మార‌డోనా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో 21 మ్యాచ్‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. మెక్సికోతో జ‌రిగిన మ్యాచ్‌తో అత‌డి రికార్డ్‌ను మెస్సీ స‌మం చేశాడు. 20 మ్యాచ్‌ల‌తో రెండో స్థానంలో అర్జెంటీనా ప్లేయ‌ర్ మ‌షేరానో ఉన్నాడు.