తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నేటి షెడ్యూల్ ఇదే - బ్రెజిల్ జోరు కొన‌సాగేనా

Fifa World Cup 2022 Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నేటి షెడ్యూల్ ఇదే - బ్రెజిల్ జోరు కొన‌సాగేనా

28 November 2022, 8:01 IST

  • Fifa World Cup 2022 Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నేడు ఆస‌క్తిక‌ర మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. బ్రెజిల్‌తో స్విట్జ‌ర్లాండ్ కీల‌క పోరుకు సిద్ధ‌మైంది. గ్రూప్ హెచ్ నుంచి సౌత్ కొరియా, ఘ‌నా మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది. అలాగే కామెరూన్‌ను సెర్బియా ఢీ కొట్ట‌బోతున్న‌ది

బ్రెజిల్ వ‌ర్సెస్ స్విట్జ‌ర్లాండ్‌
బ్రెజిల్ వ‌ర్సెస్ స్విట్జ‌ర్లాండ్‌

బ్రెజిల్ వ‌ర్సెస్ స్విట్జ‌ర్లాండ్‌

Fifa World Cup 2022 Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గ్రూప్ జీ నుంచి నాకౌట్ చేరుకునే టీమ్‌లు ఏవ‌నేది నేడు క్లారిటీ రానుంది. గ్రూప్ జీ నుంచి నేడు రెండు మ్యాచ్‌లు జ‌రుగున్నాయి. బ్రెజిల్‌- స్విట్జ‌ర్లాండ్, కామెరూన్ - సెర్బియా పోరుకు సిద్ధ‌మ‌య్యాయి. గాయం కార‌ణంగా స్విట్జ‌ర్లాండ్ మ్యాచ్‌కు బ్రెజిల్ స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మ‌ర్ దూర‌మ‌య్యాడు. అత‌డి లేని లోటును బ్రెజిల్ ఎలా భ‌ర్తీ చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సెర్బియాతో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు అదిరిపోయే విక్ట‌రీని అందించాడు రిచ‌ర్ల‌స‌న్‌. నేటి మ్యాచ్‌లో అత‌డు రాణించ‌డంపైనే బ్రెజిల్ గెలుపు అవ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి. స్విట్జ‌ర్లాండ్‌పై గెలిస్తే బ్రెజిల్ నాకౌట్ బెర్త్ ఖ‌రారైన‌ట్లే. అయితే స్విట్జ‌ర్లాండ్ నుంచి బ్రెజిల్‌కు గ‌ట్టిపోటీ ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. గ్రూప్ స్టేజ్ ఫ‌స్ట్ మ్యాచ్‌లో కామెరూన్‌పై స్విట్జ‌ర్లాండ్ విజ‌యాన్ని సాధించింది. ఎంబోలో గోల్ చేసి స్విస్‌ను గెలుపు బాట ప‌ట్టించాడు. కెప్టెన్ అఖాంజీ, ష‌కిరీ సూప‌ర్ ఫామ్‌లో ఉండ‌టం స్విట్జ‌ర్లాండ్‌కు క‌లిసిరావ‌చ్చు.

కామెరూన్ వ‌ర్సెస్ సెర్బియా

గ్రూప్ జీలో భాగంగానే కామెరూన్‌, సెర్బియా మ‌ధ్య మ‌రో మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ రెండు జ‌ట్లు ఓట‌ముల‌తో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను మొద‌లుపెట్టాయి. నాకౌట్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవ‌డంతో తొలి గెలుపు కోసం రెండు జ‌ట్లు బ‌రిలో దిగ‌నున్నాయి. సెర్బియాతో పోలిస్తే కామెరూన్ బ‌లంగా క‌నిపిస్తోంది.

మ‌రో మ్యాచ్‌లో సౌత్‌కొరియాతో ఘ‌నా త‌ల‌ప‌డ‌నున్న‌ది. గ్రూప్ స్టేజ్ ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఉరుగ్వేపై గెలిచి జోరుమీదున్న‌ది సౌత్ కొరియా. ఆ జోరును ఘ‌నాతో మ్యాచ్‌లో కొన‌సాగించాల‌ని భావిస్తోంది. నేటి మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ బెర్తును ఖ‌రారు చేసుకోవాల‌ని భావిస్తోంది.

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నేటి మ్యాచ్‌లు ఇవే...

బ్రెజిల్ వ‌ర్సెస్ స్విట్జ‌ర్లాండ్‌

కామెరూన్ వ‌ర్సెస్ సెర్బియా

సౌత్ కొరియా వ‌ర్సెస్ ఘ‌నా