తెలుగు న్యూస్  /  Sports  /  England Won The Toss Chose To Field First Against Pakistan In T20 World Cup Final

PAK vs ENG T20 World Cup Final: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ - టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - పాకిస్థాన్ బ్యాటింగ్‌

13 November 2022, 13:01 IST

  • PAK vs ENG T20 World Cup Final: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లాండ్‌, పాకిస్థాన్ చెరోసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్నారు. రెండోసారి క‌ప్‌ను సొంతం చేసుకునేందుకు ఇరు టీమ్‌లో బ‌రిలో దిగాయి.

పాకిస్థాన్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌
పాకిస్థాన్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌

పాకిస్థాన్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌

PAK vs ENG T20 World Cup Final: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తుది అంకానికి చేరుకుంది. నేడు ఇంగ్లాండ్ పాకిస్థాన్ మ‌ధ్య ఫైన‌ల్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఏడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లు జ‌ర‌గ‌గా పాకిస్థాన్‌, ఇంగ్లాండ్ చెరోసారి విన్న‌ర్‌గా నిలిచాయి. రెండో సారి పొట్టి ప్ర‌పంచ క‌ప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌నే సంక‌ల్పంతో ఇరు జ‌ట్లు బ‌రిలో దిగ‌నున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

పాకిస్థాన్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉంది. ఇంగ్లాండ్ ఓపెన‌ర్స్ జోస్ బ‌ట్ల‌ర్‌, అలెక్స్ హేల్స్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియాపై ఇద్ద‌రు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. మ‌రోసారి వారిద్ద‌రు బ్యాట్ ఝులిపిస్తే పాకిస్థాన్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. మిడిల్ ఆర్డ‌ర్‌లో బెన్ స్టోక్స్‌, సాల్ట్‌, లివింగ్‌స్టోన్ కూడా సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు బ్యాటింగ్‌తోనే ఇంగ్లాండ్ విజ‌యాల్ని అందుకున్న‌ది. బౌలింగ్ మాత్రం గొప్పగా లేదు మ‌రోవైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజాం ఫామ్ లేమితో ఇబ్బందులు ప‌డుతున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వ‌చ్చాడు. రిజ్వాన్‌, మ‌సూద్‌, మ‌హ‌మ్మ‌ద్ హ‌రీస్ అడ‌పాద‌డ‌పా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ న‌వాజ్‌, షాబాద్ ఖాన్ ప‌రుగుల్ని క‌ట్ట‌డి చేయ‌డ‌మే కాకుండా వికెట్లు తీస్తున్నారు. షాహిన్ ఆఫ్రిది కూడా సౌతాఫ్రికా మ్యాచ్‌లో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.