తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Vs England: ఇంగ్లండ్ వరల్డ్ రికార్డ్.. పాక్‌ బౌలర్లను చితకబాదుతూ సెంచరీల మోత

Pakistan vs England: ఇంగ్లండ్ వరల్డ్ రికార్డ్.. పాక్‌ బౌలర్లను చితకబాదుతూ సెంచరీల మోత

Hari Prasad S HT Telugu

01 December 2022, 17:31 IST

    • Pakistan vs England: ఇంగ్లండ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసింది. టెస్ట్‌ క్రికెట్‌లో తొలి రోజే 500కుపైగా రన్స్‌ చేసిన తొలి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. పాక్‌ బౌలర్లను చితకబాదుతూ ఇంగ్లిష్‌ బ్యాటర్లు నలుగురు సెంచరీల మోత మోగించారు.
సెంచరీలు చేసిన ఓలీ పోప్, హ్యారీ బ్రూక్
సెంచరీలు చేసిన ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ (AP)

సెంచరీలు చేసిన ఓలీ పోప్, హ్యారీ బ్రూక్

Pakistan vs England: పాకిస్థాన్‌ బౌలర్లను వాళ్ల సొంతగడ్డపై చితకబాదారు ఇంగ్లిష్‌ బ్యాటర్లు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా వీరబాదుడు బాదారు. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. దీంతో ఇంగ్లండ్‌ తొలి రోజే 4 వికెట్లకు 506 రన్స్‌ చేసి వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పటి టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో తొలి రోజే 500కుపైగా స్కోరు చేసిన తొలి టీమ్‌గా ఇంగ్లండ్‌ నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలీ (122), బెన్‌ డకెట్‌ (107)లతోపాటు ఓలీ పోప్‌ (108), హ్యారీ బ్రూక్‌ (101 నాటౌట్‌) సెంచరీల మోత మోగించారు. తొలి రోజే నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం కూడా వరల్డ్‌ రికార్డే. దీంతో ఇంగ్లండ్‌ తొలి రోజు వెలుతురు సరిగా లేక ఆట ముగిసే సమయానికి కేవలం 75 ఓవర్లలోనే 4 వికెట్లకు 506 రన్స్‌ చేయడం విశేషం. ఒకవేళ మొత్తం 90 ఓవర్ల ఆట జరిగి ఉంటే ఇంగ్లండ్‌ మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టేదే.

బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌, అంతగా అనుభవం లేని పాకిస్థాన్‌ బౌలర్లను మొదటి నుంచీ ఆటాడుకున్నారు ఇంగ్లండ్‌ బ్యాటర్లు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి తొలి సెషన్‌లోనే వికెట్‌ నష్టపోకుండా 174 రన్స్‌ చేయడం విశేషం. ఆ తర్వాత ఈ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్‌కు 233 రన్స్ జోడించారు. ఆ తర్వాత 50 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడిపోయాయి.

అయితే ఓలీ పోప్‌, హ్యారీ బ్రూక్‌ నాలుగో వికెట్‌కు 176 రన్స్ జోడించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు కూడా సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీ20 ఆడినట్లుగా తొలి రోజు ఇంగ్లండ్‌ ఏకంగా ఓవర్‌కు 6.74 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. పాక్‌ బౌలర్లలో కేవలం మహ్మద్‌ అలీ మాత్రమే ఓవర్‌కు ఆరు పరుగుల కంటే తక్కువ రన్స్‌ ఇచ్చాడు. బ్రూక్‌, డకెట్‌లు టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేయగా.. క్రాలీ, పోప్‌లకు ఇది మూడో సెంచరీ.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు అసలు ఇంగ్లండ్ ప్లేయర్స్ ఫిట్ గా ఉంటారా లేదా అన్న సందేహం నెలకొంది. వాళ్ల టీమ్ లో 13 మంది ప్లేయర్స్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. అయితే మ్యాచ్ సమయానికి ఆ టీమ్ ఫిట్ గా ఉన్న 11 మందిని బరిలోకి దింపడంతో తొలి టెస్ట్ అనుకున్న సమయానికే ప్రారంభమైంది. అలాంటి ఇంగ్లిష్ ప్లేయర్స్ తొలి రోజే ఇలా విధ్వంసం సృష్టిస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.