తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kane Williamson Test Records: టెస్టుల్లో కేన్ విలియ‌మ్స‌న్ కొత్త రికార్డ్ - అత‌డే నంబ‌ర్ వ‌న్‌

Kane Williamson Test Records: టెస్టుల్లో కేన్ విలియ‌మ్స‌న్ కొత్త రికార్డ్ - అత‌డే నంబ‌ర్ వ‌న్‌

27 February 2023, 11:02 IST

  • Kane Williamson Test Records: న్యూజిలాండ్ క్రికెట‌ర్‌ కేన్ విలియ‌మ్స‌న్ టెస్టుల్లో కొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. ఆ రికార్డ్ ఏదంటే...

కేన్ విలియ‌మ్స‌న్
కేన్ విలియ‌మ్స‌న్

కేన్ విలియ‌మ్స‌న్

Kane Williamson Test Records: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియ‌మ్స‌న్ ( Kane Williamson)టెస్టుల్లో కొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. న్యూజిలాండ్ టీమ్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డ్ రాస్ టేల‌ర్ పేరు మీద ఉంది. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న రెండో టెస్ట్ ద్వారా టేల‌ర్ రికార్డ్‌ను విలియ‌మ్స‌న్ అధిగ‌మించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

112 టెస్టులు ఆడిన రాస్ టేల‌ర్ 7683 ప‌రుగులు చేశాడు. 92 టెస్టుల్లోనే టేల‌ర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన విలియ‌మ్స‌న్ 53.33 యావ‌రేజ్‌తో 7787 ర‌న్స్ చేశాడు.త‌న రికార్డ్‌ను బ్రేక్ చేసిన విలియ‌మ్స‌న్‌కు టేల‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశాడు.

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న టెస్ట్‌లో ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్‌ను స్ఫూర్తిదాయ‌క ఇన్నింగ్స్ తో గ‌ట్టెక్కించాడు విలియ‌మ్స‌న్. సెంచ‌రీ తో రాణించాడు. 132 ర‌న్స్ చేశాడు. టెస్టుల్లో విలియ‌మ్స‌న్‌కు ఇది 26వ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

విలియ‌మ్స‌న్‌తో పాటు వికెట్ కీప‌ర్ బ్లండెల్ 90 ర‌న్స్‌తో రాణించ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 483 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్‌, కాన్వే హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఇంగ్లాండ్ ముందు 258 ప‌రుగులు టార్గెట్‌ను విధించింది న్యూజిలాండ్‌. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 435 ప‌రుగులు చేయ‌గా న్యూజిలాండ్ 209 ప‌రుగుల‌కు ఆలౌటై ఫాలో ఆన్‌ను ఎదుర్కొన్న‌ది.