తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dc Vs Pbks | దుమ్ము రేపిన ఢిల్లీ.. జితేష్‌ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి

DC vs PBKS | దుమ్ము రేపిన ఢిల్లీ.. జితేష్‌ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి

Hari Prasad S HT Telugu

16 May 2022, 23:22 IST

    • కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసి ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్‌. చేజింగ్‌లో చేతులెత్తేసిన పంజాబ్‌ బ్యాటర్లు తమ టీమ్ ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేశారు.
అక్షర్ పటేల్ బౌలింగ్ లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డ్
అక్షర్ పటేల్ బౌలింగ్ లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డ్ (PTI)

అక్షర్ పటేల్ బౌలింగ్ లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డ్

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్ల పని పట్టారు. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టి.. 17 పరుగుల తేడాతో గెలిచారు. 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 రన్స్‌ మాత్రమే చేసింది. జితేష్‌ శర్మ (34 బాల్స్‌లో 44) పోరాడినా టీమ్‌ను గెలిపించలేకపోయాడు. రాహుల్‌ చహర్‌తో కలిసి 8వ వికెట్‌కు 41 పరుగులు జోడించినా.. కీలకమైన సమయంలో ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 4, కుల్దీప్‌, అక్షర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఢిల్లీ నాలుగో స్థానంలోకి దూసుకెళ్లగా.. బెంగళూరు ఐదోస్థానానికి దిగజారింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

160 రన్స్‌ టార్గెట్‌ తక్కువే అనిపించింది. అందుకు తగినట్లే పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు కూడా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ధావన్‌, బెయిర్‌స్టో 3.5 ఓవర్లలోనే 38 రన్స్‌ జోడించారు. ఆ తర్వాత 15 బంతుల్లోనే 28 రన్స్‌ చేసిన బెయిర్‌స్టో భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి పంజాబ్‌ పతనం మొదలైంది.

తన తొలి ఓవర్లోనే శార్దూల్‌ ఠాకూర్‌.. మొదట భానుక రాజపక్స (4)ను, తర్వాత ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (19)ను ఔట్‌ చేయడంతో పంజాబ్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. తర్వాత వచ్చిన కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (0), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (4), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో పంజాబ్‌ 61 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

టాపిక్