తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz 1st T20: కాన్వే... మిచెల్ హాఫ్ సెంచ‌రీలు - టీమ్ ఇండియా టార్గెట్ 177

IND vs NZ 1st T20: కాన్వే... మిచెల్ హాఫ్ సెంచ‌రీలు - టీమ్ ఇండియా టార్గెట్ 177

27 January 2023, 20:54 IST

  • IND vs NZ 1st T20: డెవాన్ కాన్వే, డారీ మిచెల్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో 176 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ పొదుపుగా బౌలింగ్ చేసి ఆక‌ట్టుకున్నాడు.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

IND vs NZ 1st T20: రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 176 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో డారీ మిచెల్‌, డెవాన్ కాన్వే హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ అప్ప‌గించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఓపెన‌ర్లు ఫిన్ అలెన్‌, డెవాన్ కాన్వే న్యూజిలాండ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. డెవాన్ కాన్వే 35 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 52 ర‌న్స్ చేశాడు. ఫిన్ అలెన్ 23 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 35 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. తొలి వికెట్‌కు వీరిద్ద‌రు 4 ఓవ‌ర్ల‌లోనే 43 ప‌రుగులు చేయ‌డంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసేలా క‌నిపించింది. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని సుంద‌ర్ విడ‌దీశాడు.

ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లోనే చాప్‌మ‌న్‌ను డ‌కౌట్ చేసి టీమ్ ఇండియాకు సుంద‌ర్ మ‌రో బ్రేక్ ఇచ్చాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతోన్న డారీ మిచెల్ ఒంట‌రి పోరాటంతో కివీస్‌కు భారీ స్కోరు చేసింది. చివ‌ర‌లో వ‌రుస సిక్స‌ర్ల‌తో మిచెల్ చెల‌రేగాడు. 30 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు, 3 ఫోర్ల‌తో 59 ర‌న్స్ చేశాడు. అత‌డి మెరుపుల‌తో న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 176 ర‌న్స్ చేసింది. టీమ్ ఇండియా బౌల‌ర్ల‌లో సుంద‌ర్ రెండు వికెట్లు, అర్ష‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్, శివ‌మ్ మావి త‌లో ఒక్క వికెట్ తీశారు.