తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid: టీమ్‌తో కలిసి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫన్నీ సెలబ్రేషన్‌ చూశారా?

Rahul Dravid: టీమ్‌తో కలిసి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫన్నీ సెలబ్రేషన్‌ చూశారా?

Hari Prasad S HT Telugu

19 July 2022, 22:15 IST

    • Rahul Dravid: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ విజయాన్ని టీమిండియా బాగానే సెలబ్రేట్‌ చేసుకుంది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఓ ఫన్నీ సెలబ్రేషన్‌లో టీమ్‌తోపాటు కనిపించాడు.
కోచ్ రాహుల్ ద్రవిడ్
కోచ్ రాహుల్ ద్రవిడ్ (AFP)

కోచ్ రాహుల్ ద్రవిడ్

లండన్‌: టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌, వెస్టిండీస్‌తో జరగోబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన శిఖర్‌ ధావన్‌ ఓ ఫన్నీ వీడియోను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టీమ్‌ అంతా వరుసగా హే అని చెబుతూ వెళ్తుంటారు. ఈ వీడియో చివర్లో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా హే అని చెప్పడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ముందుగా ధావన్‌ హే ట్రెండ్‌ను స్టార్ట్‌ చేయగా.. వరుసగా శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, సిరాజ్‌, ఇషాన్‌ కిషన్‌, చివరగా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దానిని కొనసాగించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఆ మధ్య ఇందిరా నగర్‌ కా గూండా అంటూ ఓ యాడ్‌లో నటించిన రాహుల్‌ ద్రవిడ్‌ ఎంత ఫన్నీగా కనిపించాడో.. ఇప్పుడీ వీడియోలోనూ అలాగే అనిపించాడు. సాధారణంగా ద్రవిడ్‌ చాలా కామ్‌గా ఉంటాడు. అతడు పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోవడం ఎప్పుడూ చూసింది లేదు. తాను ప్లేయర్‌గా ఉన్న రోజుల్లోనే పక్కా జెంటిల్మన్‌లాగా కనిపించిన అతడు.. ఇప్పుడు కోచ్‌గా యువ ఆటగాళ్లతో ఇలాంటి వీడియోలు చేయడం విశేషం.

హే ఫ్రమ్‌ టీమిండియా అంటూ ఈ వీడియోను ధావన్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది. కేవలం నాలుగు గంటల్లోనే నాలుగు లక్షలకుపైగా లైక్స్‌ వచ్చాయి. ఈ జనరేషన్‌ క్రికెటర్లు ద్రవిడ్‌ను కూడా మార్చేశారంటూ ఓ యూజర్‌ కామెంట్ చేశాడు. ఇప్పుడీ యంగ్‌ టీమ్‌ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది.

ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ టీమ్‌కు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. తర్వాత జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా తిరిగి రానున్నాడు. ఈ టూర్‌ మొత్తానికి విరాట్‌ కోహ్లికి రెస్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జులై 29 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది.