తెలుగు న్యూస్  /  Sports  /  Bumrah Out Of T20 World Cup With Back Injury

Bumrah out of T20 World Cup: టీమిండియాకు భారీ షాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బుమ్రా ఔట్‌

Hari Prasad S HT Telugu

29 September 2022, 15:29 IST

    • Bumrah out of T20 World Cup: టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. టీ20 వరల్డ్‌కప్‌కు స్టార్‌ పేస్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. గురువారం (సెప్టెంబర్‌ 29) ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి కూడా ధృవీకరించారు.
బుమ్రాకు వెన్నుగాయం
బుమ్రాకు వెన్నుగాయం (ANI)

బుమ్రాకు వెన్నుగాయం

Bumrah out of T20 World Cup: భయపడినంతా జరిగింది. ఈ మధ్య వరుస గాయాల బారిన పడుతున్న స్టార్‌ పేస్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. టీ20 వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యాడు. అతని వెన్నులో కాస్త చీలిక కనిపించినట్లు తేలింది. ఈ గాయంతో అతడు వరల్డ్‌కప్‌కే కాదు కొన్ని నెలల పాటు టీమ్‌కు దూరంగా ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

Pro Kabaddi League Winner: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత పుణెరి పల్టన్.. ఫైనల్లో హర్యానా చిత్తు

బుమ్రాకు సర్జరీ అవసరమా లేదా అన్నదానిపై నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీ ఫిజియోలు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆసియాకప్‌కు కూడా గాయం కారణంగా దూరమైన బుమ్రా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఆ టీమ్‌తో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడాడు.

సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌ సమయానికి బుమ్రాకు మళ్లీ గాయమైందని బీసీసీఐ తెలిపింది వెన్ను నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌ ఆడటం లేదని వెల్లడించింది. ఇప్పుడిక సౌతాఫ్రికా సిరీస్‌తోపాటు వరల్డ్‌కప్‌ కూడా ఆడలేకపోతున్నాడు. ఇది ఇండియన్‌ టీమ్‌కు నిజంగా పెద్ద దెబ్బే. ముఖ్యంగా పేస్‌బౌలర్లు డెత్‌ ఓవర్లలో ఇబ్బంది పడుతున్న సమయంలో బుమ్రా లేని లోటు ఇండియన్‌ టీమ్‌ను మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

"బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌ అయితే కచ్చితంగా ఆడటం లేదు. అతని వెన్ను గాయం తీవ్రంగా ఉంది. వెన్నులో కాస్త చీలిక కనిపిస్తోంది. దీని కారణంగా అతడు ఆరు నెలల పాటు టీమ్‌కు దూరంగా ఉండొచ్చు" అని సీనియర్‌ బీసీసీఐ అధికారి వెల్లడించారు.