తెలుగు న్యూస్  /  Sports  /  Bumrah Injured Again As Fans Expressing Their Disappointment With The Pacer

Bumrah Injured Again: బుమ్రాకు మళ్లీ గాయం.. ముంబైకి అన్ని మ్యాచ్‌లూ ఆడతాడు కదా అంటూ ఫ్యాన్స్ సీరియస్

Hari Prasad S HT Telugu

28 September 2022, 20:56 IST

    • Bumrah Injured Again: స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మళ్లీ గాయపడ్డాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు దూరమైనట్లు కెప్టెన్‌ రోహిత్‌ చెప్పాడు. అప్పటి నుంచి ట్విటర్‌లో ఫ్యాన్స్‌ అతనిపై సీరియస్‌ అవుతున్నారు.
బుమ్రాకు వెన్ను గాయం
బుమ్రాకు వెన్ను గాయం (PTI)

బుమ్రాకు వెన్ను గాయం

Bumrah Injured Again: టీ20 వరల్డ్‌కప్‌ దగ్గర పడుతున్న సమయంలో టీమిండియా స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తరచూ గాయపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మధ్యే గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమై ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మళ్లీ టీమ్‌లోకి వచ్చిన బుమ్రా.. ఇప్పుడు మళ్లీ గాయపడ్డాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు అతనికి వెన్ను గాయమైంది. ప్రాక్టీస్‌ సందర్భంగానే తనకు వెన్నునొప్పి ఉన్నట్లు బుమ్రా చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీంతో ఈ మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నట్లు టాస్‌ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ చెప్పాడు. బీసీసీఐ మెడికల్ టీమ్‌ అతన్ని పరీక్షించిందని, తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నట్లు బీసీసీఐ కూడా ప్రకటించింది. ఇది విన్న ఫ్యాన్స్‌ బుమ్రాపై తీవ్రంగా మండిపడుతున్నారు. అప్పటి నుంచి ట్విటర్‌లో బుమ్రాకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున మొత్తం 14 మ్యాచ్‌లు ఆడతాడు కదా అని ఒకరు ట్వీట్‌ చేయగా.. బుమ్రా కింగ్‌ ఆఫ్‌ ఇంజురీస్‌ అంటూ మరొకరు సెటైర్‌ వేశారు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌కు బుమ్రాకు రెస్ట్‌ ఇవ్వాలని, సెమీఫైనల్‌, ఫైనల్‌కు అతడు ఫ్రెష్‌గా ఉంటాడని మరో అభిమాని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

నిజానికి వరల్డ్‌కప్‌ ముందు స్ట్రైక్‌ బౌలర్‌ అయిన బుమ్రా ఇలా తరచూ గాయాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసియాకప్‌కు దూరమైన అతడు ఆస్ట్రేలియా సిరీస్‌కు తిరిగొచ్చినా ఇలాగే తొలి టీ20 ఆడలేదు. ఆ తర్వాత నాగ్‌పూర్‌లో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆడాడు. ఇక హైదరాబాద్‌లో నిర్ణయాత్మక మూడో టీ20లో ఆడినా 4 ఓవర్లలో ఏకంగా 50 రన్స్‌ ఇచ్చాడు.

బుమ్రా దూరం కావడంతో ఈ మ్యాచ్‌కు దీపక్‌ చహర్‌ తుది జట్టులోకి వచ్చాడు. అతనితోపాటు అర్ష్‌దీప్‌, హర్షల్‌ పటేల్‌ పేస్‌ బౌలర్లుగా ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇండియా ఆడబోతున్న చివరి టీ20 సిరీస్‌ కావడంతో ఆ మెగా టోర్నీ తుది జట్టులో ఉండే ప్లేయర్స్‌ అందరికీ తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా ఇలా దూరం కావడం మేనేజ్‌మెంట్‌కు మింగుడుపడనిదే.