తెలుగు న్యూస్  /  Sports  /  Brazil Star Player Neymar Ruled Out Of Remaining Group Stage Matches With Ankle Injury

Neymar Injury Update: బ్రెజిల్‌కు షాక్ - గాయంతో గ్రూప్ మ్యాచ్‌ల‌కు నెయ్‌మ‌ర్ దూరం

26 November 2022, 10:12 IST

  • Neymar Injury Update: చీల‌మండ గాయంతో బ్రెజిల్ స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మ‌ర్ గ్రూప్ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. నాకౌట్ మ్యాచ్‌ల‌కు అత‌డు అందుబాటులో ఉంటాడ‌ని వైద్య‌బృందం ప్ర‌క‌టించింది.

 నెయ్‌మ‌ర్
నెయ్‌మ‌ర్

నెయ్‌మ‌ర్

Neymar Injury Update: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బ్రెజిల్‌కు షాక్ త‌గిలింది. స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మ‌ర్ గ్రూప్ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. చీల‌మండ‌ గాయంతో స్విట్జ‌ర్లాండ్‌, కామెరూన్ తో జ‌రిగే మ్యాచ్‌ల‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డ‌ని బ్రెజిల్ టీమ్ డాక్ట‌ర్స్ ప్ర‌క‌టించారు. సెర్బియాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో నెయ్‌మ‌ర్ గాయ‌ప‌డ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

చీల‌మండ వ‌ద్ద వాపు రావ‌డంతో ఇబ్బందిప‌డ్డ అత‌డు ఎన‌భ‌య్య‌వ నిమిషంలో ఆట నుంచి త‌ప్పుకున్నాడు. మ్యాచ్ ముగిసే వ‌ర‌కు ఐస్‌క్యూబ్స్‌తో నెయ్‌మ‌ర్‌కు డాక్ట‌ర్స్ చికిత్స అందిస్తూ క‌నిపించారు. ప్ర‌స్తుతం అత‌డికి వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు టీమ్ మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది. గాయం నుంచి నెయ్‌మ‌ర్ త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని, నాకౌట్ మ్యాచ్‌ల‌కు అత‌డు అందుబాటులో ఉంటాడ‌ని తెలిపింది.

సెర్బియాతో జ‌రిగిన మ్యాచ్‌లో రిచ‌ర్లిస‌న్ రెండో గోల్స్ చేసి బ్రెజిల్‌కు విజ‌యాన్ని అందించాడు. నెయ్‌మ‌ర్ లేని లోటును తీర్చాడు. సెర్బియాపై గెలుపుతో గ్రూప్ జీలో బ్రెజిల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. త‌ర్వాతి మ్యాచ్‌లో స్విట్జ‌ర్లాండ్‌తో బ్రెజిల్ త‌ల‌ప‌డ‌నుంది.